నాకు నచ్చిన స్పందన

 నాకు నచ్చిన స్పందన


వాసంత సమీరం మోసుకొని వచ్చే మల్లె పూల సౌరభం
మణి కిరీటం లేనీ మహారాజు
హాయిగ సాగే మబ్బుల్లా
ఆకాశంలో విహరించే హంసల్లా
రొహిణి కార్తెలో రోళ్లు మద్దెలల్లే మోగడం
ఎత్తులకు ఎగిరే చైతన్యం
మట్టి లోతుల్లోకి చొచ్చే ఉత్సాహం
కాలపు పొదలో పొంచి అడవి ఎలుగుబంటి విధి క్రూరాతి క్రూరంగా దాడి చేయడం
దేహం ఉక్కు ముక్క అని భ్రముంప జేయటం
చిక్కులు తీయని నెత్తికి కొబ్బరి నూనెలా మారి పోవాలనుకోవడం
జీవిత గుమ్మానికి కాలం కట్టిన మామిడి తోరణం
మనుషులను కలిపి కుట్టేసే దయా వృక్షం
కటువు మాటలు కందిరీగల్లా కుట్టడం
వేదనను భరిస్తూ అశాంతి తీరం వెంట పయనించే బాటసారికి మాటల ఊటే పరమౌషధం
ఫైరులా పెరిగిన మాటలు - మానవీయ రాగాలు  - మెదళ్లలో పచ్చని కాంతులీనే అలల నురగలు
వెలుతురు నీడలో స్నానమాడి రసార్తిలో జ్వలించి  పోవడం
పురుగు పట్టిన పూల చెట్టు
మెట్లు విరిగిన నిడుపు నిచ్చెన
బాణం తగిలిన పందేపు పావురం
గాలి పంజరంలో చిక్కుబడి అల్లాడుతున్న ఆకు
నీళ్లు అడుగంటిన ఊరి కోనేరు
ఒంటరి చీకటి
ముడి వీడని భ్రుకుటి
మరకల గోడ మీద తిరుగుతున్న కత్తుల ఫంకా నీడ
శస్త్ర చికిత్సల బల్ల మీద చిధ్ర మైన నిశ్చల స్వప్నం
గాలిలో తేలి వచ్చి గుండెను తడిమిన శీతల సహచర మమకార స్పర్శ
కరచాలనాన్ని నెమరేయడం
స్నేహ జలాన్ని చేతికందించడం
దేహం లోపలి ఎడారి దేశాలన్నిటికన్నా విశాలం
తడిలేని ఇసుకను మోయడం

ఇలా రాయడం మాలాంటి వాళ్లకు సాధ్య మయ్యేదేనా  ! మీ మెదడు  ఎంత చురుగ్గా  భావాల వెంటబడి వాటిని లాక్కొచ్చి రచనలో బంధీలను చేస్తాయి . మీరు వాడే ప్రతి మాట తేనెల ఊట. మీరు రాసే ప్రతి వాక్యం అమృతపు జల్లును కురిపిస్తుంది.  విషయాన్ని పక్కన పెడితే దాన్ని అందించే విధానం ఎంత సౌందర్య భరితంగా ఉంటుంది. మీలాంటి వాళ్లే రాయాలి. మాలాంటి వాళ్లు కేవలం చదవాలి . మీ తలరాత ఎలా ఉన్నా మీ రాత లోని గొప్ప తనాన్ని ఎంత చెప్పినా తక్కువే. రాయండి రవి గారూ. నిర్విరామంగా రాసి రాశి పొయ్యండి. తర తరాలకూ అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి

Comments