కవిత:
ఆకాశంలో ఎగిరే పక్షులు
ఆకాశంలో విహరించే పక్షులు
స్వేచ్ఛగా ఎగిరే రెక్కలు
నీలిరంగు సముద్రంపై తెల్లని మేఘాలు
చూడగానే కళ్ళకు ఆహ్లాదం
చిన్న చిన్న పాటలు పాడుతూ ఆడుతూ.
చెట్ల కొమ్మలపై వాలి విశ్రాంతి తీసుకుంటూ
పచ్చని చెట్లపై గూళ్ళు
అందులో ముచ్చట గొలిపే పిల్లలు
రంగురంగుల ఈకలు
అవి ఎక్కడికి వెళు తున్నాయో ఎవరికి తెలుసు.
వాటి రూపం ఎంతో రమ్యం
వాటి పాటలు ఎంతో మధురం
రకరకాలుగా ఉంటాయవి
కొన్ని పక్షులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వలస వస్తాయి.
స్థానిక పక్షులు ఉంటాయి
ఒకే చోట ఏండ్ల తరబడి
మన పర్యావరణ వ్యవస్థకు రక్షణ పక్షులు
అవి నియంత్రిస్తాయి కీటకాల జనాభాను
విత్తనాలను వెదజల్లి
చెట్లను వ్యాప్తి చేస్తాయి
మనిషి మనుగడకు తోడ్పడే మణులు పక్షులు
మహాసముద్రం దేవకి
Comments
Post a Comment