జపానులో సునామీ ( వాస్తవ కథ)

 Katha:


జపానులో సునామీ ( వాస్తవ కథ)

ఆత్మహత్య చేసుకోవాలను కొనే వాళ్లకు కను విప్పు ఈ కథ, ఒకవేళ తప్పని సరై ఆత్మ హత్య చేసుకోవాలను  కుంటే కుటుంబ సభ్యుల్ని ఒకసారి గుర్తు  తెచ్చుకోమంటుంది.

క్రీ. శ. 869 లో జపాన్ లో చాలా పెద్ద భూకంపం వచ్చింది. దాని ధాటికి ఇండ్లెన్నో నేల కూలాయి. జనాలతో పాటు పశువులు భయంతో పరుగులు పెట్టాయి. ఇండ్ల కప్పుల కింద , పశువుల కాళ్ల కింద పడి ప్రజలు చాలా మంది చనిపోయారు. కట్టేసిన పశువులు కట్టిన చోటే భూస్థాపిత మైనాయి. భూకంపం చాలదన్నట్లు వెన్నంటి సునామీ వచ్చింది. హోరుమని చెవులు చిల్లులు పడేట్లు శబ్దాలు. చాల ఇండ్లు సముద్రం లో కొట్టుకు పోయాయి. ఇక మనుషులొక లెఖ్ఖా . వాటితో పాటే వాళ్లూను. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం.

1960 లో  జపాన్  ప్రభుత్వం అణు విద్యుత్ కేంద్రాన్ని  ( Nuclear power plant ) కట్టడానికి సన్నాహాలు మొదలు పెట్టింది  . దాని వల్ల చుట్టు పక్కల వాళ్లకు ప్రమాదం పొంచి ఉంది. అందు వల్ల సముద్రం దగ్గర కట్టాలనుకున్నారు. అక్కడయితే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని వాళ్ల ఊహ.

ఆ జాగ్రత్తల్లో భాగంగా ఆ కేంద్రం చుట్టూ బలమైన, ఎత్తయిన గోడ కట్టి సముద్రం వల్ల వచ్చే  ఆటుపోట్లను అధిగమించ వచ్చని వాళ్ల ఆలోచన. పవర్ ప్లాంట్ బిల్డింగ్ రెండంతస్థులు. విశాలమైన దాని చుట్టూ ఎత్తయిన గోడ నిర్మించాలనుకుంటే అసలు కన్నా వడ్డి ఎక్కువయ్యే పరిస్థితి. పైగా ఎంత ఎత్తు కట్టాలో ఇంజనీర్లు అంచనా వెయ్య లేక పోయారు. 19 అడుగులు  కడితే  సునామీ  బారి నుండి రక్షణ లభిస్తుందనుకున్నారు. కట్టారు. అంత ఎత్తును అలలు తాక లేవని ఇంజనీర్ల అంచనా .

అణువిద్యుత్ కేంద్రం ఫుకుషీమలో సముద్ర సమీపంలో నిర్మితమయింది. దాని పేరు ఫుకుషీమా డాయిచ్చి .

869 లోని  భూకంపం  తర్వాత . అనుకోకుండా 2011 మార్చిలో భయంకరమైన భూకంపం , వెనువెంటే సునామీ వచ్చి పడింది. 15000 మందిని పొట్టన పెట్టుకుంది. పిల్లా, పాపా, ముసలీ ముతక, గొడ్డో గోదా , కొంప గోడూ మొత్తం సముద్రం పాలైంది . ప్రభుత్వానిది ఎప్పుడూ కాకి లెఖ్ఖలే . ఇండ్లలో ఉండే వాళ్లు, వీధుల్లో ఉన్న వాళ్లు ఉన్నపళంగా అకాల మరణానికి గురైనారు.

ఆ సునామీ అణు విద్యుత్ కేంద్రాన్ని తాకింది. ఆ గోడ అలల్ని బాగానే అడ్డుకుంది . మూడుసార్లు అల్ల కల్లోలం సృషించి అలలు భయంకరంగా ఎగిసెగిసి పడ్డాయి. రెండవ  సారి పైకెగసిన అలలు
కొంచం గోడను దాటింది. కానీ భవనానికి ఏమీ కాలేదు. మూడవ సారి వచ్చిన రాకాసి అల పవర్ ప్లాంట్ భవనాన్ని ముంచెత్తింది.

ఉన్నటుండి కరెంటు పోయింది. ఫోనులు పనిచెయ్య లేదు. సముద్ర జలం నుంచి పుట్టే విద్యుత్ నీళ్లు తాకగానే వేడి పొగలు కమ్ముకున్నాయి. అలా వేడి ఎక్కువైనపుడు చల్ల బరచడానికి చల్లని నీళ్ల టాంకులుంటాయి. కూలింగ్ వాటర్ ఉన్న ఆ టాంకులు  కూడా క్షణాలో పగిలి పోయాయి. అణు కేద్రాన్ని నియంత్రించే గది( కంట్రోల్ రూం ) దెబ్బతిని పని చేయడం మానేసింది. ఎవరికి ఎం చేయాలో తోచలేదు. ప్రాణాలు అరిచేతిలోకి వస్తే. వాటిని పట్టుకొని పరుగులు తీశారు.

చుట్టు పక్కల ఇండ్లలో ఉన్న చాలా మంది టార్చ్ లైట్ సాయంతో అణుకేంద్రానికివెళ్లి  మెటల్ షెల్టర్లో తలదాచుకున్నారు.

మెటల్ షెల్టర్ యాంటీ రేడియేషన్ షెల్టర్. హానికరమైన కారకాల నుండి ప్రజలను రక్షించడానికి ఇవి నిర్మించబడతాయి. ప్రమాదాన్ని ఇది కొంత తగ్గిస్తుంది. పవర్ ప్లాంట్లు, ట్రెంచులు, డగ్గౌట్లు , పిట్లు, ఇంకా బల్క్ షెల్టరు ఉంటాయి. ఇవి నేల మాళిగలో నిర్మితమై బంక మట్టితో కప్ప బడి ఉంటాయి. గోడలు వంపు తిరిగి ఒక గోడ వైపు కూర్చోవడానికి బెంచీలు అమర్చబడి ఉంటాయి. మరో గోడలో  ఆహారం నిల్వ చేసే అరలు , తాగునీటి కంటైనర్లు ఉంటాయి. ప్రేలుడు సమయంలో రేడియో ధార్మికాలు, విష పూరితమైన పదార్థాల నుంచి ఇవి రక్షిస్తాయి. కూలిపోతున్న  భవనాల శిథిలాల బారిన పడకుండా ఇవి రక్షిస్తాయి. కానీ పూర్తి రక్షణను ఇవి అందిస్తాయని చెప్పలేము . అణు విస్ఫోటనం ఇంకా చొచ్చుకు పోయే రేడియేషన్ యొక్క షాక్ వేవ్ ప్రభావాన్ని ఇవి బలహీణ పరుస్తాయి కానీ సంపూర్ణ మైన రక్షణను ఇవ్వవు .

ఈకథ  నూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి కాదు. దీనావస్థలో చిక్కుకున్న వేలాది కుటుంబాల్లో ఒక కుటుంబం కథ.

మికియో వతనాబే ఫుకుషిమా వద్ద ఉన్న ఒక పల్లెలో పుట్టి పెరిగాడు. పెళ్లయింది. భార్య పేరు హమకో . అతనికి ఆ ఇల్లంటే ప్రాణం. పెళ్లయి 39 యేండ్లయింది. ముగ్గురు పిల్లలు. వాళ్లు అక్కడే పెరిగి పెద్దయినారు. వాళ్ల దారి వారిది . బతుకు తెరువు కోసం తలో మూల ఉన్నారు. అయినా వతనాబే భార్యతో అదే ఇంట్లో ఉంటూ స్వయంగా పని చేసుకు బ్రతుకుతున్నాడు. హమకో కూడా పెండ్లయినప్పటి నుండి ఉంటున్న ఆ ఇంటితో గాఢమయిన అనుబంధం ఏర్పరచుకుంది.

పుట్టి పెరిగిన ఆ ఇల్లంటే వతనాబేకి ప్రాణం. ఆ ఇంట్లో ఉంటే అతనికి నిశ్చింత. అది అతనికి కొండంత బలాన్ని ఇస్తుంది. ఇంకా కొన్నేండ్లు పని చేసి ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవాలని అతని కోరిక. హమకోకు కూడా ఆ ఇల్లే సర్వస్వం.

ప్లాంటులో నీళ్లు పోసినందున చాలా గ్యాస్ వెలువడింది . అది పీల్చితే ప్రమాదం. అందువల్ల ప్లాంట్ చుట్టు పక్కల ఉన్న జనాల్ని పోలీసులు దూర తీరాలకు తరలిస్తున్నారు. ముందు 1 కిలోమీటరు  దూరంలో ఉన్న ఇండ్ల వాళ్లందరిని 164000 మందిని తరలించారు. గ్యాస్ ఎక్కువ వెలువడుతుండడంతో దాని పరిధిని. 2 కి. మీ.  కు పెంచారు. అలా పెంచుకుంటూ 5 కి. మీ. వరకు  ఉన్న వాళ్లను శిబిరాలకు  తరలించారు. అలా వెళ్లిన వాళ్లలో మికియో వతనాబే కుటుంబం కూడా ఉంది .

శిబిరంలో ఉండడం వతనాబే దంపతులకు ఏ మాత్రం ఇష్టం లేదు. తన ఇంట్లో ఉన్నంత హాయిగా, ప్రశాంతంగా, స్వేఛ్చగా  ఇక్కడ ఉండలేక పోయారు. పదే పదే ఇంటిని గుర్తు తెచ్చుకొని బాధ పడే వాళ్లు.

వత నాబేకి కోళ్ల ఫారం ఉండేది. అది మూత బడింది. దాని వల్ల వాళ్లకు పని లేకుండా అయింది. ఎవాపరేషన్ సెంటర్లో రోజూ చింతించడం తప్ప ఇంకో పని లేదు.

మికియో వతనాబె భార్య రోజులో చాలా సార్లు ఏడుస్తూ తనను ఇంటికి తీసుకెళ్లమని బ్రతిమాలేది.

జూన్ లో అధికారులను ( అథారిటీస్ )  కలిసి భార్య వేదనను చెప్పి ఇంటికి వెళ్లడానికి అనుమతి కోరాడు వతనాబే . ఎట్టకేలకు వాళ్లు ఒకరాత్రి మాత్రం ఉండడానికి అనుమతి ఇచ్చారు.

ఆనందంగా ఇంటి ఆవరణలో అడుగు పెట్టిన వారికి నిలువెత్తు పెరిగిన గడ్డి దర్శన మిచ్చింది. వెంటనే అతను గడ్డికోసే పనిలో మునిగి పోయాడు. ఆమె వంట పనిలో పడింది .

ఇల్లు గతంలో లాగే ఉండడతో ఆమె సంతోష పడింది. ఇక్కడే ఉండొచ్చు కదా! ఎందుకు వెళ్లాలి అని అనుకుంది. అదే మాట భర్తతో అంది. 'ఇల్లు ఎప్పటిలాగే ఉంది. ఇక్కడే ఉందామంది'. భర్త 'రేపు వెళ్లాల్సిందే తప్పదు ' అన్నాడు. ' నువ్వెళ్లు . నేను ఒంటరిగానైనా ఇక్కడే ఉంటాను ' అని ఖచ్చితంగా చెప్పింది. ' వీలులేదు. పిచ్చి ఆలొచనలు మానేయి. ఇద్దరం కలిసే వెళ్లి పోవాలి . తప్పదు అన్నాడు.

అర్ధరాత్రి ఆకలయి అతనికి మెలకువ వచ్చింది. లేచాడు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న భార్యను చూశాడు. ఓదార్చబోయిన భర్తను పట్టు కొని ఇంకా చాలా విలపించింది.

ఉదయం మిగిలి పోయిన గడ్డి కోయడానికి వెళ్లాడు. ఆపని పూర్తి చేసి శిబిరానికి వెళ్లాలని అతని ఆలోచన. మొత్తం గడ్డి కోసి దాన్నంత  కుప్ప చేర్చి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో భార్య కనిపించలేదు. ఫారం దగ్గరెక్కడో ఉంటుందనుకొని కిటికీలో నుంచి బయటికి చూశాడు. దూరంగా పొగలు.  గడ్డికి నిప్పు పెట్టింది కాబోలు ! అనుకున్నాడు. కాసేపయ్యాక కాఫీ కలిపి అమెకు కుడా ఇద్దామని ఇంటి బయట అడుగు పెట్టాడు. భార్యను వెతుక్కుంటూ పొగ వస్తున్న వైపు వెళ్లాడు. గడ్డిని కాలుస్తూ అక్కడుందనుకున్నాడు. అక్కడి కెళ్లాక పూర్తిగా కాలిపోయిన భార్య శరీరం అతని కంటబడింది. అంతే కుప్ప కూలిపోయాడు. సునామీ నుంచి బయట బడిన మూడు నెలలకు ఆమె ఆత్మ హత్య చేసుకొని చనిపోయింది.

ఈ కథ చదివిన వారు ఈ హత్యకు గతంలో వచ్చిన కొన్ని నెలల ముందు సంభవించిన సునామీకి సంబంధం ఉందని అనుకోరు.  కానీ సునామీ కారణంగానే జరిగిందిది. దీనిని కారణం  దాచబడిన మరణం (hidden death )  అంటారు. దీన్ని అర్థం చేసుకోలేక సునామీ అంశాన్ని వదిలేశారు.

అక్టోబర్ 7 న లండన్లో హాఠ్ హాల్ నుంచి ( hathall ) రైలు  లీడ్స్ ( Leeds) కు వెళ్తోంది  185  కిలో మీటర్లు అంటే గంటకు 1115 మైళ్ల వేగంతో అది ప్రయాణం  చేస్తూ ఉంది. ఆ రైల్వే ట్రాక్ చాల పాతది. తుప్పు బట్టి అక్కడక్కడ చీలిపోయి బుడపలు  కట్టి ఉంది. ట్రాక్ ను చెక్ చెయ్యాల్సిన రైల్వే అధికారులెవరూ గత కొంత కాలంగా దానిని చెక్ చేసిన పాపాన పోలేదు.

వేగాంగా వెళ్ల్తున్న రైలు ధాటికి అది తట్టుకోలేక పోయింది. అంతే ! హఠాత్తుగా రైలు పెను ప్రమాదానికి గురి అయింది . పక్కకు వాలిపోయిన ఆరైలు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. డెబ్భై మందికి పైగా గాయాలయ్యాయి . చాలా మంది ఇబ్బంది పాలైనారు. ఇవి కూడా కాకి లెక్కలే సుమా!

ఇలాంటి ప్రమాదం మళ్లీ జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ? తాత్కాలికంగా రైలు వేగాన్ని తగ్గించారు. వేగాన్ని నియత్రించారు. వేగం తగ్గించడం వల్ల ఏమీ కాదనుకున్నారు. ట్రైన్లో ప్రయాణం చేసే వాళ్లలో చాలా మందికి సొంత కార్లున్నాయి. ట్రైన్ వేగం తగ్గించే సరికి కార్లలో వెళ్లడం మొదలు పెట్టారు. ట్రైన్ అక్సిడెంట్ల లంటే కారు ప్రమాదాలు ఎక్కువైనాయి.

సునామీ లో కాల్చుకొని చనిపోయిన ఆమె భర్తకు పోలీస్ యంత్రాంగం పైన, ప్రబ్జుత్వం పట్ల విపరీతమైన కోపం వచ్చింది. సునామీ రాక పోతే సుఖంగా ఉండే వారు. కానీ ఆమె చని పోయింది సునామీ వల్ల కాదని వాళ్ల వాదన. అమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నీకు చెప్పిందా అని వ్యంగంగా ప్రశ్నిస్తారు.

ఇంకా 102 ఏండ్ల వయసున్న వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పుట్టినప్పటి నుండి 102 ఏండ్ల వయసు వచ్చినా అతను తన ఇల్లు వదిలి ఎక్కడికీ వెళ్లింది లేదు. ఇప్పుడు నేనెందుకు వెళ్లాలి అని ఆత్మహత్యకు పాలు పడ్డాడు.

సునామీ కారణంగా 130 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు N. H. QK ( ప్రపంచ అంతర్జాతీయ వార్తా సంస్థ )  అధికారికంగా ప్రకటించింది. 15 నిముషాల్లో  షెల్టరుకు వెళ్లమన్నప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న వాళ్లందరిని బస్సులో పడుకో బెట్టారు. డాక్టర్ల సాయం అందక కొంత మంది ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. బస్సులో తరలించే పని చేశారు కానీ వాళ్లకు గానీ, వాళ్లతో వెళ్తున్న నర్సులకు గానీ తిండీ నీళ్లు లేవు.

ఒక కుటుంబం సునామీ కారణంగా సంభవించిన రేడియేషన్ కు భయపడి షెల్టర్ కు కాకుండా ఇంకా దూరం వెళ్లారు. ఒక స్చూల్లో కుర్చోవడానికి  కుర్చీలు గాని, వస్తువులు పెట్టుకోవడానికి కబ్బోర్డ్స్ కాని లేని చిన్న గదిలో పిల్లల్ని పెట్టి బంధించారు. కానీ వాళ్ల ఆలనా పాలనా పట్టించుకున్న నాధుడు లేడు. ఆకలితో, ఊపిరాడక చాలా మంది నరకం అనుభవించి పిల్లలు ఫ్రాణాలు వదిలారు. వాళ్ల మానాన వాళ్లను వదిలేసి ఉంటే బతికే వారు .

మహాసముద్రం దేవకి 

Comments