వ్యక్తిగత భావాలు : ఆచార్య బిరుదురాజు రామరాజు
ఆచార్య బిరుదు రాజు రామాజు గారి తోటి నాకున్న అనుబంధం అత్యంత సన్నిహిత మైంది.ఆయన నన్ను సొంత కూతురిలా భావిస్తే, నేను సొంత నాన్నే అన్నట్లుండే దాన్ని .పిలవడం కూడా ' నాన్నగారూ ' అనే పిలిచేదాన్ని .ఎప్పుడు హైదరాబాదు వెళ్ళినా సొంత ఇల్లులాగా ఎన్నాళ్ళయిన ఉండడం కాదు . ఆ ఇంటిలో నేను ఆడింది ఆట పాడింది పాట . నా స్నేహితులను కూడా ఏకంగా వాళ్ళింటికి తీసుకెళ్ళి ఎన్నాళ్లవసరమైతే ఆన్నాళ్ళు ఉండగలిగే స్వాతంత్ర్యం నాకు ఆ ఇంటిలో ఉండేది .వాళ్ళు అనంతపురం వచ్చినా అంతే. ఆ కుటుంబంలో అందరూ వాళ్ళ బంధువులతో సహా నన్ను ఆ ఇంటి మనిషిగానే భావించే వాళ్లు . చివరికి నా పెళ్లి విషయం కూడా పట్టించుకొని శ్రీనివాస రెడ్డిగారి చేతులు పట్టుకొని ' నా బిడ్డను చేసుకో నాయినా ' అని అడిగారని మా ఆయన చెప్పేవారు .సొంత కూతురన్నట్లు నన్ను పెళ్ళి కూతుర్ని కూడా వాళ్లింట్లోనే చేశారు. ' నా అల్లుడు అందగాడు అని గర్వంగా చెప్పుకునే వారు .ఈ మధ్యనే వెనిగళ్ళ రాంబాబు గారు ఆ విషయం మాటల సందర్భంలో గుర్తు చేశారు .నా జీవితంలో ఇంటిల్లిపాదీ మానవత్వం మూర్తీభవించిన వక్తులను ఆ ఇంటిలోనే చూశాను .మా ఇంటిలో , ఆ ఇంటిలో మా అమ్మా నాన్నలతో పాటు ఆ అమ్మానాన్నలను, , మా అక్కా బావలను ,చిన్న తమ్ముడిని ,మా వారిని , ఒకే ప్రాణమన్నట్లుండే రామరాజు గారి అమ్మాయి రుక్మిణిని, కొడుకు నారాయణ రాజుని, ఇంకో కూతురు శ్రీదేవిని వరసగా పోగొట్టుకొని జీవచ్చవంలా ఉన్నాను .ఆత్మీయత అంటే ఎలా ఉంటుందో చవి చూపించిన మహనీయులు ఆ అనురాగ మూర్తికి హృదయ పూర్వకంగా అంజలి ఘటిస్తున్నాను .
ఈ విషయాలను చెప్పుకో వలసిన అవసరం లేదు . అయినా చెప్పకుండా ఉండ లేక పోయాను .అన్యధా భావించరు కదా !
మహాసముద్రం దేవకి
అనుబంధాలు అమూల్యమైనవి మేడం
ReplyDeleteనమస్తే మేడం ఆచార్య రామరాజు సార్ గారు మీ వల్లనే నాకు కూడా పరిచయం సారు గారు సత్యసాయి మహాభక్తులు స్నేహశాలి, సంతోషం ఈ విధంగా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని తలుచుకోవడం చాలా సంతోషం.
ReplyDelete