నాకు నచ్చిన కవిత - అతన్నెందు కడగరు

 కవిత :


నాకు నచ్చిన కవిత :

తెలంగాణలో ఒక సాంఘిక సంక్షేమ హాస్టల్లో జరిగిన సంఘటన ఇది . పదవ తరగతి చదివే ఒక అమ్మాయిపై ఒక రక్షక భటుడు బెదిరించి, భయపెట్టి ఎక్కడికో పిలిపించుకొని  అత్యాచారం చేస్తే ఆ అమ్మాయి గర్భం దాల్చింది. చివరికి హాస్టల్లోనే ప్రసవించింది. గర్భం దాచి పెట్టుకునేది కాదు. అన్ని రోజులూ ఆ అమ్మాయిని పట్టించుకున్న వాళ్లు లేరు. అంటే ఆ హాస్టల్లో పర్యవేక్షణ ఏమాత్రం ఉందో ఊహించ వచ్చు. ఆ అమ్మాయి ప్రసవించి బిడ్డను ఒక ట్రంకు పెట్టె లో పెట్టేసింది. రూమ్మేట్ ద్వారా ఆ విషయం వెలుగు చూసింది . అది తెలిసిన పత్రికల వాళ్లు ప్రత్యేక మైన వార్తగా బాక్స్ కట్టి 'అభినవ కుంతి' అని శీర్షిక పెట్టి ఆ అమ్మాయిదే  తప్పన్నట్లు కించ పరుస్తూ రాస్తే దానికి స్పందిస్తూ మా శ్రీవారు ఆచార్య శ్రీనివాస రెడ్డి గారు రాసిన కవిత ఇది. ఒక పురుషుడుగా ఆ అమ్మాయి తరఫున వకాల్తా పుచ్చు కొని రాయడం నచ్చింది నాకు . ఆ క

Comments