మెదడుకు మేత -34

 మెదడుకు మేత -34


1. చిటుకు పటుకు మని చిందులేసే చిలక - గుట్టు చప్పుడు కాకుండా గోడెక్కి దూకుతాది 


2. చిత్రమైన చీర కట్టిన చిలకల కొలికి పూసే వారింటికే కాని కాసే వారింటికి పోదు 


3. చిన్నప్పుడు నిండుగా బట్ట కప్పుకున్న చిన్నారి చిలకమ్మ 

పెద్దయ్యాక విప్పేస్తుంది 


4. చిల్లులు ఉంటాయ్ వొళ్లంతా - కానీ

జల్లెడ కాదు 

వాలుతూ లేస్తూ ఉంటుంది కాని పక్షి కాదు 


5. చీకటింట్లోకి వెళ్లొద్దు - చిక్కు ముల్లు తొక్కొద్దు 


6. చెట్టుకు పుట్టని కాయ నమిలితే భలే రుచి 


7. చూడ చక్కని పిల్ల 

సుందరమైన పిల్ల 

వీపున బారెడు జడేసుకొని 

విందుకు పోతుంది 


8. చూస్తే చిన్నోడు సన్నాసి కాడు 

ఒంటి నిండా నార బట్టలతో ఊరూరా తిరుగుతుంటాడు 


9. చెట్టుకు పావడ కట్టంగ 

ఎండకు వానకు తడవంగా 

ఇంట్లో మూలకు చేరంగ 


10. చెట్టు మీదుంటుంది కానీ పక్షి కాదు 

చక్కని వస్త్ర ముంటుంది కాని సిద్ధ యోగి కాడు 

కళ్లున్నా మనిషి కాడు 

ఎందరెదురొచ్చినా చూడ లేడు 


10. 


4.

Comments