చెల్లెలి అభిమానం

కథ :

చెల్లెలి అభిమానం

హాస్పిటల్ నుంచి ఇంటి కొచ్చిన అన్నను చూసి పోవడానికి పండ్లు ఫలహారాలతో ఒచ్చింది చెల్లెలు సుశీల.

ఇంకా ఆపరేషన్ జరగక ముందు భర్తతో హాస్పిటల్కు ఒక సారి వచ్చి చూసి పోయింది. ఇప్పుడు ఒంటరి గానే వచ్చింది.

పక్కింటి మంగమ్మవ్వోళ్ల ఎద్దుల కొట్టంలో కొక్కిరిస్తా  ఉన్ని గుడ్లు పెట్టే కోడిని పట్టియ్యమని సావిత్రి ఎదురింటి పట్టాభిని అడుగుతుంటే ' ఇప్పుడెందుకొదినా కోడి . వద్దు నా మాట ఇను . ' అని మొహమాటం తో అనింది సుశీల.

' నీ కోసం కాదులే మీ యన్న కోసం. డాక్టరు చెప్పినాడులే ! మాంసము  , గుడ్లు బాగా వాడమని' అనింది సావిత్రి .

కట్టిల పొయ్యి మింద కూర కుత కుత ఉడకతా ఉంది. పొయ్యిల్లు దాటి కూర వాసన ఈది గుండా ప్రయాణమయి పోతా ఉంది. సంగటికి పిండి పోసి ఒక చిన్న గిన్నెలో కూర ముక్కల్ని ఏసుకొచ్చి మొగుని ముందు పెట్టి తిన మనింది. 'ఇప్పుడెందుకు  ఒకేసారి అన్నం తినేటప్పుడు తింటాలే ' అన్నాడు వెంకటేసు. మళ్లీ తిందువులే గాని 'ఊరికే పండుకోనుంటే పొద్దు బొయ్యేదెట్లా ' అనింది.

తన చిన్న నాటి స్నేహితు రాలిని పలకరించి అప్పుడే ఇంట్లో కొచ్చింది సుశీల . జబ్బు పడిన భర్త నొదిలి సవతి తమ్ముని పెండ్లికి ఎలా వెళ్లాలా అని సతమతమవుతున్న సావిత్రి సుశీలను నాలుగు రోజు లుండమని అడిగింది .

సుశీలకు స్కూలు కెళ్ళే పిల లిద్దరున్నారు .అత్తమ్మ వాళ్ళను చూసుకుంటానంటే అన్నను చూడ్డానికి వచ్చింది . వదిన పుట్టింట్లో పెళ్లి . భర్తకు బాగుంటే ఇద్దరూ కలిసి వెళ్లి ముందుండి పెళ్లి పనుల్లో సాయం చేసే వాళ్ళు .ఇప్పుడు పెళ్లికి వెళ్ళ డానికే ఆలోచించాల్సిన పరిస్థితి.

ఎవరి పనులు వాళ్ళ కున్నాయి .కానీ అవసరంలో ఆదు కొనే వాళ్లుంటే సమస్యలుండవు . సుశీల వదినకు సాయపడడానికే నిర్ణయించు కొంది. పెళ్లయిన మర్నాడే వచ్చేస్తాను అనిన వదినతో ' ఫర్లేదు రెండు రోజులు ఉండే రా వదినా .సెకండ్ శాటర్డే , సండే పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఇబ్బంది లేదని వదినకు సర్దుకోవడం లో కూడా సాయం చేసింది సుశీల .సావిత్రి భర్తకు , జాగ్రత్తలు చెప్పి , మందులు వెయ్యడం గురించిన వివరాలు సుశీలకు చెప్పి నిశ్చింతగా బయలు దేరింది .

మర్నాడు సుశీల ఇంటి పనులన్నీ చక్కబెట్టింది. వంటచేసి అన్నీ అన్నకు అమర్చి పెట్టి చిందర వందరగా ఉన్న ఇంటిని శుభ్రం చెయ్యడంలో మునిగి పోయింది

మధ్యాహ్నం, సుశీల తన అన్నయ్య వెంకటేసుతో మాట్లా డింది."అన్నయ్యా, నువ్వు ఇలా ఒంటరిగా ఉండకూడదు. సావిత్రికి చాలా పని ఉంది. ఇంటి పనే కాదు .కూలికి వెళ్ళాలి . లేకుంటే ఇల్లు గడవదు .అప్పుడే పనికి వెళ్ళక దాదాపు పదిహేను రోజు లయింది. నువ్వు కాస్త కోలుకున్నావు కదా!  జరుగు బాటుంటే జరమంత సుఖం లేదని ఉంది పోవద్దు . నీ పనులు నువ్వు చేసుకో" అని సలహా ఇచ్చింది.

"అవును సుశీలా, నువ్వు చెప్పింది నిజం. సావిత్రి చాలా కష్టపడుతోంది " అని అంగీకరించాడు వెంకటేసు. వాకర్ సాయంతో మెల్లగా పనులు చేసుకోవడం మొదలు పెట్టాడు.

పెళ్ళిలో ఆనందంగా గడిపి తిరిగి వచ్చింది సావిత్రి .b ఇంటిని, భర్తను చూసి ఆశ్చర్య పోయింది .సుశీల ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. సావిత్రి చాలా బాధపడింది.

"సుశీలా, నీ సాయాన్ని జన్మలో మరిచి పోలేను" అని సుశీల చేతులు పట్టుకుంది సావిత్రి

"చింతించకు వదినా . నేను వీలున్నప్పుడంటా వస్తుంటాను " అని ఓదార్చింది సుశీల.

సుశీల ఇంటికి వెళ్ళిపోయింది. సావిత్రి ఒంటరిగా మిగిలిపోయింది. కానీ, సుశీల చేసిన సహాయంతో ఆమె ధైర్యం చాలా పెరిగింది. 'కష్ట సమయాల్లో కుటుంబ సభ్యులు, , బంధువులు స్నేహితుల సహాయం చాలా అవసరం కదా! ' అను కొంది.

మహాసముద్రం దేవకి 

Comments