గొంతెమ్మ కోర్కెలు
పాండవులు కౌరవులతో జూదమాడి సర్వస్వం కోల్పోయారు. ద్రౌపతితో అరణ్యవాసానికి వెళ్లి పోయారు. కుంతి మాత్రం హస్తినలోనే ఉండిపోయింది. కానీ ఆమె మనసంతా కొడుకుల మీదే. వాళ్లు ఎప్పుడు తిరిగి వస్తారా అని ఎదురు చూసేది. వాళ్లు బాగుండాలని తన మనసులోనే ఎన్నో కోర్కెలు కోరుకొనేది. .
ఆ సమయంలో ఆమె రాజమాత కాదు. రాణి అసలే కాదు. సంపద కాని, అధికారం కానీ లేని దీన స్థితి ఆమెది. ఆమె ఉత్త ఊహలతోనే ఆనందించేది. తర్వాత పాండవులు వచ్చి అధికారం చేపట్టినా ఆమె కోరికలు అన్నీ నెరవేర లేదు. అలా ఆమె మనసులో కోరుకున్నవే
' కుంతెమ్మ కోరికలు ' వ్యవహారం లో అదే గొంతెమ్మ కోరికలయింది.
అలివి కాని , తీరని , అందరాని కోరికలు కోరుకొనే వాళ్లను , అవి జరుగుతాయని భావించి ఆనందించే వాళ్లను చూసి ' గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నావని ' అంటారు.
ఇంట్లో పిల్లలు ఏవైనా కోరితే అవి తీర్చడం కష్టం అనిపించినప్పుడు 'ఆశకు అంతుండాలి . ఇక చాలు నీ గొంతెమ్మ కోర్కెలు కట్టి పెట్టు' అని దండిస్తుంటారు
మహాసముద్రం దేవకి
Comments
Post a Comment