మెదడుకు మేత - 38
1. మా ఊరికి చార్జి రూ 99-75
రాను పోను ఎంత ?
2. వేటకు పొయ్యి రెండావుల్ని పట్టు కొస్తే - ఒకావు పాలిచ్చా , ఇంకొకటి రక్తమిచ్చా
3. పన్నెండు మంది అన్నదమ్ములకు ఒకటే మొలతాడు
4. చిన్న పిల్లోడు అందరి దగ్గరికి వచ్చి అన్నం తింటాడు
5 . కట్టడి చెయ్యడానికి చేతిలో కర్రున్నా కొంటె పిలగాళ్లు ఎగిరెగిరి కంచె దాటి కాన దాటి బయటి పోతానంటారు
6. దేశం లోని ప్రజలందరూ ఏదో ఒక రోజు అన్నం తినరు
7. పెడితే తింటుంది
పెట్ట కుంటే తినదు
8. వండని కుండ
పొయ్యని నీళ్లు
వెయ్యని చెక్కెర
తియ్యగ ఉండు
9. తల్లిని కొడుతుంటే
పిల్లలు భయపడి
మూలకొకరు పరుగు పెడతారు
10. కింద తూటు పైన పర్రెలు
పర్రెలు సాగదీసి పెడతారు పడతులు
Comments
Post a Comment