మెదడుకు మేత - 37

 మెదడుకు మేత - 37


1 .కుర్ కుర్ రాజ్యంలో టుర్ టుర్ దొరసానులు కాలి నడక నడవ బోయి తూలి తూలి దూకుతారు

 

2 .హనుమంతు రావు పెండ్లాం ధనవంతురాలై  తట్టెడు సొమ్ములు పెట్టుకొని తలదించుకు కూర్చుంది 


3.ఉడతలా ఊగుతూ జలగలాగ పాకుతూ పిఠాపురం వెళ్లి పిడికెడు నీళ్లు తెస్తాడు 


4.చనిపోయిన. పీనిగ సంతకొస్తుంది సంపాదించి పెడతానంటుంది


5.చిలప చిలప నీళ్లల్లో కులుకుతూ- సీతమ్మ   జలకాలాడుతోంది


6. కుట్టిన చీర కట్టుకున్న చిటుకు పటుకులాడి గోడ దూకంగానే పరిగెత్తుతుంటుంద


7 .ఏటెంబడి బడి ఎర్రి పాప- ఏడుస్తూ పోతుంది 


8 .బదులుకు బండరాయి నీ పక్కనుండేదేంది 


9 .సదూ శాస్త్రం లేని సన్నాసీ రెక్కలు ముడవని పక్షి పేరేమి 


10 .జానెడు గుంతలో మానెడి పగడాలు

Comments