మెదడుకు మేత - 35

 మెదడుకు మేత - 35


పొడుపు కథలు సాధారణంగా 1 నుంచి 5 పంక్తులు దాకా ఉంటాయి.


ఈ రోజు 1 పంక్తిలో  ఉండే  పొడుపులు వేస్తాను 


1. అది సూస్తే వేలెడు లేదు తోక మాత్రంబారెడు

   

 2 .ఎర్రని తోటకు తెల్లని కాపలా దార్లు 


3 .అందగాడికి రోజుకో ఆకారం ఆ తర్వాత గుండు సున్న 


4 .ఎర్రని దొర నల్లని రుమాలుకట్టినాడు 


5 .మూడింటితో ముగిసే పెద్ద కథ 


6 . ఏటెంబడి ఏర్రి పాప ఏదుస్తూ పోయింది


7. వాడే కొద్ది తరుగుతూ మాయమై పోయే వన్నెలాడి  


8 .అంబుకు చెంబు చెంబులో చారెడు నీళ్లు 


9 .అల్లుడుగారి తోటలో పెద్ద పండు పడితే పది మంది చచ్చారు 


10 .అల్ల నేరేడు ఆడుతూ పాడుతూ వస్తే దూలాలు స్తంభాలు కదులుతూ వస్తాయి

Comments