మెదడుకు మేత - 30

 మెదడుకు మేత  - 30 


' ఆ' తో మొదలయ్యే పొడుపులు : 


ఆకేసి అన్నం పెడితే తీసేసి భోంచేస్తావా ? 

ఆలమూరు సంతలో హంస దాని ఒంటి కాలు కురచ 

ఆ మనిషికి రెండు కాళ్లు ఏడు చేతులు 

ఆకు తమల పాకు కాయ కజ్జికాయ కట్టె వెదురు కట్టె 

ఆకు లేని పండు 

ఆకాశంలో ఎగిరే రాయి 

ఆడ వాళ్ల కాళ్ల వెంట చప్పుడు చేస్తూ వెళ్తుంది 

ఆ తల్లికి ముగ్గురు కొడుకులు . తిరిగే ఆ కొడుకులు ఎప్పుడూ కలవరు 

ఆ ఇంట్లో రెండు గిన్నెలు , గిన్నెల నిండా పాలు , పాల మధ్య చింత పిక్కలు 

ఆ వైపు తింటూ ఈ వైపు విడుస్తుంది

Comments