మెదడుకు మేత - 24
1. ఎండిన మాను ( తోలు) గల గల
2. ఒక ఆడమనిషి మొగ మనిషితో ' మీ అమ్మ మా అమ్మకు ఒక్కతే కూతురు ' అని చెప్పింది. వాళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ?
3. చక్కని మానుకు చిక్కని గజ్జెలు
4. ఇక్కడ వేసిన గడారు ( వదిలిన గాలిపటం ) హిందూపూరులో తేలింది
5. ఈమె అత్తగారి తల్లి నాకత్త గారు
6. జుట్టున్నా ముడి పెట్టు కోదు
7. అంబాటి చెరువులో ఐదు ఏనుగులు పొర్లాడే
8. ఇంటెనక నూగు చెట్టు ఎంత కోసినా గుప్పెడు కాదు
9. ఎనిమిదెముకలు తట్టెడు పేగులు
10. మాలగా కట్టని పువ్వు
Comments
Post a Comment