మెదడుకు మేత - 22
1. ఒళ్లంతా కళ్లే చూపు మాత్రం ఒకటే
2. ఏమి నా వెంటొస్తావ్?
నన్ను చూస్తుంటావ్.
నన్ను పెట్టుకుంటావ్
3. ఆదోనికి పోయి ఆకేసుకోనొచ్చె
కర్నూలుకు పోయి కాటుక పెట్టుకోనొచ్చె
4. ఎద్దు నిలబడే ఉంది
తాడు మాత్రం పారాడుతోంది
5. ఒక్కటి పట్టుకుంటే రెండు ఊగులాడ్తాయి
6. రెండు బావులకు ఒకటే దూలం
7. రస రసాలు తిన్న రాజు కడుపులో పేగుల్లేవు
8. అందరికి చెప్పి వస్తాడు
చెప్ప కుండా వెళ్లి పోతాడు
9. దానిలో పుట్టి దానిలోనే మరణించింది
10. అంగీ మీద లుంగీ కట్టుకొని ఆకాశాం వైపు పోతుంది
Comments
Post a Comment