మెదడుకు మేత - 9
1. అంతు లేని చెట్టుకి అరవై కొమ్మలు
కొమ్మ కొమ్మకూ కోటి రెమ్మలు
రెమ్మ రెమ్మకూ లెక్కలేనన్ని పువ్వులు
ఆ పువ్వుల్లో రెండే రెండు కాయలు
2. అక్కడక్కడి బండి
అంతరాల బండి
మద్దూరు సంతలో
మాయమైన బండి
3. అక్కింట్లో దీపం పెడితే చెల్లి లింట్లో వెలుగొస్తుంది
4. అమారా దేశం నుంచి
తమారా పండ్లు తెస్తే
కొనేవారే గాని
తినేవారే లేరు
5. అమ్మ పెట్టే అట్లు
పిల్లలకు అవసరం
6. అమ్మా అంటానే వచ్చి హత్తుకుంటుంది
నాన్నా అంటే కదలనే కదలడు
7. ఎర్రని పట్టు సంచిలో
బంగారు నక్షత్రాలు
8. ఆకాశ పక్షి
ఎగురుతూ వచ్చి
రేపింది పిచ్చి
కడుపులో సొచ్చి
9. ఆకాశ మంతా అల్లుకు రాగా
అద్దెడు బియ్యం నలుగుతు రాగా
కడివెడు నీళ్లు కారుతు రాగా
చాటెడు చెక్కలు చెక్కుకు రాగా
అందులో ఒక రాజు ఆడుతూ ఉంటాడు
10. వక్క లేని ఆకు
సున్నం లేని నోరు
రెండూ కలవక ఎర్రన
Comments
Post a Comment