మెదడుకు మేత - 7

 మెదడుకు మేత - 7


1. ఆ బాబు ఈ బాబు హోరా హోరీ పొరాడితే తుకారాం వచ్చి తగువు తీరుస్తాడు 


2. ఇంటి వెనక కుప్ప పెట్టి కుప్పకు నిప్పును పెట్టి కుప్ప కాలిపోతేను అప్పులెల్ల తీరిపోయె 


3. ఇప్పితే ఇంకో ఇల్లుంది 

కట్టి పడేస్తే కటుక్ కటుక్ 


4. ఇరుకిరుకు మాను కింద 

ఇరిపోతు చావంగ 

దాని పొట్ట చీల్చంగ 

పులిగొబ్బు కొట్టంగ 


5. ఉరిమినప్పుడు విచ్చు పువ్వు 

బావిలోన నవ్వు పువ్వు 


6. ఏటి ఒడ్డున ఎంపలి చెట్టు 

ఎంత కొట్టినా ఇరగదు పెరగదు 


7. ఒంటి కాలి వాడు 

లావు తల వాడు 

రాజుల సభలోన 

రంజిల్లు తాడు  


8.  చెరువుకు నాలుగు తూములు 

ఆ నాలుగు తూములు తెల్లారినుంచి మళ్లీ పొద్దు పొడిచే సరికి ఐదు పంటలు పండిస్తాది


9. ఒక్కటి వచ్చింది 

పదహారింటిని తాకింది 

నూరై వెలసింది 

రెండై పోయింది 


10. గంపలో కోడి 

కదలక మెదలక 

గుడ్లు పెట్టు

Comments