మెదడుకు మేత - 5
5, 6 పంక్తుల్లో ఉన్న పొడుపు కథలు
1 .చాలని కాయా చక్కని కాయా
రాజులు పిలిచే రంధ్రాన కాయ
రాజుల మాట రాతిరి వింటి
పరుల మాట పొద్దున్నె వింటి
రానంటే వస్తాను
వస్తానంటే రాను
2. పిట్ట గాని పిట్ట కాళ్లు రెండు కన్న ఎక్కువ
పిట్టంటే పిట్ట కాదు రెక్క లొకటి తక్కువ
మెడ కాయను పైకెత్తి మెల్ల మెల్లగ నడుస్తుంది
నీళ్లు లేని సముద్రాన్ని నీటుగ దాటిస్తుంది
నీళ్లు లేని భూమి మింద నరుల కదే మూల ధనం
౩. వయ్యరి భామా వగల మారి భామా
వద్దన కుండా కాదన కుండా
వచ్చిన వారికి పోయే వారికి
దగ్గరి కొచ్చును దాచిన దిచ్చును
దూరం పోయి దోబూచు లాడును
4.మర్రి చెట్టు నిద్ర పోతుంది
విశ్వమంతా నిద్ర పోతుంది
శ్రీ రంగం నిద్ర పోతుంది
క్షీర సముద్రం నిద్ర పోతుంది
ఒకటి మాత్రం నిద్ర పోలేదు
5. శ్రీకాకుళం చిన్నదానా
చిత్రాల గంగమ్మ కూతురా
బిందెలో ముంచకుండా
చెంబు కూడ లేకుండా
తియ్యటి నీళ్లు దాహానికి తీసుకురా
6 . కట కట రాముని కడుపున పుడితి
ఎందుకు పుడితి ఏం బాపు కొంటి
ఆడదాని చేతిలో దెబ్బలు తింటి
ఎండకు ఎండితి పండక్కు వస్తి
ఎక్కడా దిక్కు లేక అగ్గిలో పడితి
7. వంకర టింకరగా పోతుంది పాము కాదు
దారి పొడుగునా దాహం తీరుస్తుంది బావి కాదు
కొండ కోనల్లో తిరుగుతుంది ఎద్దు కాదు
జల పుష్పాలకు నిలయ మవుతుంది చెరువు కాదు
అందరికీ కనువిందు చేస్తుంది ఆట బొమ్మ కాదు
8. పిఠా పురం చిన్న వాడా
పిట్టల వేటగాడా
మాయ మంత్రాలెయ్యనూ వద్దు
బతికిన పిట్టనుకొట్టనూ వద్దు
చచ్చిన పిట్టను తేనూ వద్దు
కూరకు లేకుండా రానూ వద్దు
9 .చిగురు చూడు చిగురందం చూడు
ముదురాకుల ముచ్చట్లను చూడూ
పండ్లూ కాయలు పువ్వులు లేని
పసందయిన రంగులనే చూడు
విత్తనం కోసం కొత్త ఆశతో
వెత�
Comments
Post a Comment