మెదడుకు మేత - 4
1. అగ్గిలో కాలను
నీటిలో మునగను
2. గుడి నిండా కెంపులు
గుడికి పెద్ద తాళం
౩. మాను గడను పోలు
ఆకు వస్త్రమును పోలు
పూలు చందమామను పోలు
కాయ పూలరయిక
దానిని రుచి చూడ కాదు ద్రాక్ష
4. నన్ను తాయారు చేసే వాడికి నా అవసరం లేదు
నన్ను కొనే వాడికీ నా అవసరం లేదు
నేను అవసరమైన వాడికి నా సంగతే పట్టదు
5. పేపర్లు చించుతాను కాని పిల్లోన్ని కాను
గట్టిగా అరుస్తాను కాని తిక్కోన్ని కాను
డబ్బులడుక్కుంటాను కానీ బిచ్చగాన్ని కాను
6. గుంతలో పిల్లోడు ఎగిరెగిరి రుమాలు కట్టాడు
7. ఆకాశంలో ఉంటుంది కానీ మేఘం కాదు
తోకతో ఉంటుంది కానీ ఎద్దు కాదు
అటూ ఇటూ ఎగురుతుంది కానీ పక్షి కాదు
పట్టు తప్పిందంటే పరుగు పెడుతుంది
8. గజ్జల గుర్రాన్ని ఎక్క లేరు
ముల్లొంకాయ చెట్టును తొక్క లేరు
బాణా కట్టిని పట్ట లేరు
9. తలలేనోన్ని చూసి కాళ్లు లేనోడు నవ్వినాడు
10. ఒకే ఇంటికి పుట్టిన ఆవులు
ఒకావు తెల్లగా పాలిస్తే
ఒకావు ఎర్రగా పాలిస్తే ఒకావు నల్లగా పాలిస్తుంది.
TG
Comments
Post a Comment