పొడుపు కథలు . మెదడుకు మేత - 3

 పొడుపు కథలు . మెదడుకు  మేత - 3


1.ఆమడ దూరం నుంచి అల్లుడొస్తే విత్తు లేని  కూర అత్త వండింది . అదేమి కూర?


2. ఆర్ణెళ్ల పంటొకటి 

    ఆరేళ్ల పంటొకటి 

    మూణ్ణెళ్ల పంటొకటి 

    ఒకరోజు పంటొకటి 

    ఒకటే కళ్లం లో ఒడుపుతారు 


3. తెగ నరికితే గాని తెరవదు కళ్లు 


4.గోరంట్ల సంతకు పోయి గొర్రెను తెచ్చి కోస్తే నెయ్యి     వస్తుంది కాని నెత్తురు రాదు 


5 .మేకల్ని తోలేసి తడికలను పిండుతారు 


6. నున్నటి బండ మింద నూగులెండ బోస్తే నాలుక లేనోడొచ్చి నాకి పొయినాడు 


7 .రక్తంతో పెరిగేది రక్తం లేకుండా ఉండేది 


8 .గాలిలో ఎగిరే అద్దం చేతిలో పడితే విరుగుతుంది 


9 .పాలున్నా బాలింతను కాను జడలున్నా జడధారిని కాను 


10 . చచ్చిన ఆవును ఏడిపించి ఏడిపించి కొడ్తున్నారు 


        

Comments