పరిశోధనలో పదనిసలు - 20
పొడుపు కథలు :
జానపద బాల సాహిత్యం లో పొడుపు కథలదొక ప్రత్యేక శాఖ. అన్ని ప్రక్రియల రూపంలోను పొడుకథలున్నాయి. గేయ రూపంలో ఉన్నవాటిని ఇక్కడ పరిశీలించాను .ఈ సందర్భంగా పనిలో పనిగా కొన్ని వేల పొడుపు కథల్ని సేకరించాను . ఇక్కడ బాలలు వేసుకొనే గేయ సంబంధమైన పొడుపు కథల్ని మాత్రం ఇచ్చాను. .
పరస్పరం ప్రశ్నలు వేసుకొని అబ్బుర పరుస్తూ , పసి పిల్లల మనసుల్లో ఆలోచనలను కలిగిస్తూ , చెప్పాలనే ఆసక్తిని రేకెత్తిస్తూ పొడవడంలోను, విప్పడంలోను ఆనందాన్ని కలిగించే ప్రక్రియ ఇది . ఉదా:
చెయ్యని కుండ
పొయ్యని నీళ్లు
వెయ్యని సున్నం
తియ్యగ ఉండు
- టెంకాయ
ఆడ పళ పళ ఈడ పళళ
మద్దెమ్మ్మ గుడిలో మరీ పళ పళ
ఆమడ దూరం నుంచి అల్లుడొస్తే
మంచం కిందిద్దరు మారు మూలొకరు
ఉలకక పలకక ఒదిగి ఉంటారు
- చెప్పులు , చేతి కర్ర
ఓరోరి పాపడ - నీ ఒల్లంత గుల్లలు
కారాకు పచ్చన - నీ కండెంత తియ్యన
- సీతా ఫలం లేదా పనస
పండు
( చూడుము: తెలుగు బాలగేయ సాహిత్యం )
Comments
Post a Comment