పొడుపు కథలు. మెదడుకు మేత - 1

 పొడుపు కథలు. మెదడుకు మేత - 1


1 ఆవగింజంత బలహీనత గల తండ్రికి భూగోళంలో చెప్పుకోదగినంత భూపుత్రుడవుతాడు . ఆ మహా భూ పుత్రుడెవరు? 


2, నీటిలో తెప్పలు తిరుగుతాయి . అవే చాలా మందికి ఆహారం . ఆ తెప్ప లేవి? 


3 చీనా వాడు నీటిలో మునుగితే చూపరులకు చూద్దామన్న కనపడడు.  వాడెవడు ?


4, గూళ్లలో ఉంటాము చిలకలం కాము . కాపలా వాళ్లుంటారు రాజూ మంత్రి కాము. కన్నోళ్లనందరిని ఫోటోలు తీస్తాము కెమెరాలము కాము . ఎందరొచ్చి పిలిచినా గూడు వదిలి రాము . ఎంత మంది తరిమినా తప్పించుకొని పోము . కాపలా వాళ్లతో కలిసి మెలసి పోతాము. కన్నోళ్ల నెప్పుడూ గుర్తుంచుకుంటాము 


5 .నీటిలో ఉంటాను పడవను కాను


6 . రంగని నెంట తిరిగే లింగడు ఎంత కొట్టినా  లొంగడు 


7.చిన్న చిన్నిండ్లు చిత్రమైనిండ్లు 

  ఇంటింటికి లంకె లంకెకో కొంకి 

 ఆడ వాళ్లు కోరుకొనే అరుదైన ఇండ్లు 


8 .తూట్ల తూట్ల గుర్రం తుస్సు మనే గుర్రం 

  ఎక్కే గుర్రం ఎక్కతా ఉంటే 

  దిగే గుర్రం దిగతా ఉంటే

  గుర్రానికి కావాలి కుదురయిన తోడు 

  తోడుంటె చాలు భలె మెచ్చుతారు 


9. తల్లిని చంపిన దాన్ని తెచ్చి తరిగి వండుకుంటారు 


10 . .నల్లని మంచం మీద వేసే పరుపుకు తీసే పరుపుకు విరామమే లేదు

Comments