మెదడుకు మేత - 18

 మెదడుకు మేత - 18


1. భీముడు బిగదన్నితే  - అర్జునుడు  అడ్డం బడినాడు 


2. అది మాను కాదు చిన్న మొక్క . ఐనా కొమ్మ కొమ్మకు నిమ్మ కాయ గుత్తులు 


3. నేల మీద వేసిన దుప్పటిని తీసేకి

రాదు 


4.    కొండ నిండా వేలాడే గుండ్రాళ్లు 


5. బుడము భూమిలో - నడుము గాటిలో - కొన కోలారులో 


6. అమ్మ అన్నా రాదు 

అక్క అన్నా రాదు 

చెయ్యి పట్టి ఈడిస్తే  వస్తుంది 


7. పెండ్లి కొడుకు పసుపు బట్టలిడిచి బాయిలో దూకినాడు 


8. పట్టుకుంటే పిడికెడు 

ఇడిస్తే ఇంటినిండా 


9. చింపిరి బట్టలేసుకున్న జుట్టి పోలి గాడు మా అత్తమ్మతో గుళ్లోకి పోయి ఉచ్చ పోసి వచ్చాడు 


10. రెక్కలు  వంగని పక్షి 

రేకులు రాలని పువ్వు

Comments