మెదడుకు మేత -17

 మెదడుకు మేత -17


1. విత్తు లేని పండు 


2. చొక్కా మీద చొక్కా తొడుక్కొని చక్కా వచ్చాడు చింపిరి జుట్టోడు 


3. బజారున వేస్తే ఇజారుకు పోయే 


4. గడంత గోపమ్మకు ముంతంత కొప్పు 


5. అడవతా తిరుగుతుంది 

అందరినీ నరుకుతుంది 

ఏమీ తెలీని నంగనాచిలా 

వచ్చి మూల కూచుంటుంది 


6. వేలెడంత ప్రాణికి ఒళ్లంతా  కాళ్లు 


7. పెట్టె తీస్తే పాప దొరుకుతుంది 


8. అక్కా అక్కా మనూరికి చిలక  వచ్చింది 

కొందామా? తిందామా ? అంగట్లో పెట్టు కొని అమ్ముదామా? 


9. ఏనుగును ఎలుక కన్నములో  కీడ్చె 


10. ఇంట్లో ఎవరూ లేకుంటే చెప్పండి నేను కాపలా ఉంటాను

Comments