మెదడుకు మేత - 16

 మెదడుకు మేత - 16


1. ఇంటి దీపమని  మీసాలంటించుకుంటే ఉన్న  మీసాలు  పోయాయి 


2. గుంపు చెట్లలో గున్నెద్దు రంకేసింది 


3. మిద్ది మీది మిరప చెట్టు నీళ్లు లేక ఎండి పోయె 


4. అత్త గారి కొప్పులో కోతి పిల్ల 


5. అవ్వ ఇల్లలుకు తుంటే చిల్ల ఏలబడింది 


6. ఎద్దు తొక్కని సాలు 


7. పెళ్లి కొడుకు కాలెత్తితే , పెళ్లి కూతురు చెయ్యెత్తుతుంది 


8. అందరికీ అవసరమయింది 

పట్టుకుంటే చేతికి చిక్కదు 

నమిలితే పంటికి దొరకదు 


9. ఒకే అక్షరం ఉపయోగించి దాని  గుణింతాలతో ఒక వాక్యం చెప్పాలి 


10. చెయ్యి జారితే తిరిగి రానిది

Comments