మెదడుకు మేత -15
1. నడుం వొంగిన అవ్వ నలుగురి గొంతులు కోయు
అవ్వ తెచ్చిన తలకాయలే అందరి కడుపులు నింపు
2. కడుపు నిండా గాలి ఉంది
గొంతు కడ్డం గుండు ఉంది
నెత్తి మింద గుద్దితే నురగలు కక్కుతుంది
3. పొయ్యేటప్పుడు ఒంటరిగా పోతుంది - వచ్చేటప్పుడు జంటగా వస్తుంది
4. మొగుడూ పెళ్లాలు పండు కొని ఏం చేస్తారు
5. x అనే వాడు AB లకు తండ్రి
AB లు X ను నాన్నా అని పిలుస్తారు
కానీ AB లు X కొడుకులు కారు
6. మబ్బింట్లో దుబ్బ దెయ్యం
7. చిత్త చిత్తగించి
స్వాతి చల్ల బడి
విశాఖ విసరకుంటే
అనురాధలో
అడిగినంత పండుతాను
8. ఏడాకుల చెట్టును
ఎక్కలేము దిగలేము
9. కాళ్లు లేనోడు చెవి లేనోణ్ణి పట్టుకుంటాడు
10. అందరికి ఒకడే కొడుకు
అందరికి ఒకతే కూతురు
Comments
Post a Comment