మెదడుకు మేత - 13

 మెదడుకు మేత - 13


1. తలపైన కిరీటం ఉంది మహారాజును కాను 

గొంతు దాకా తాగుతాను తాగుబోతును కాను 

అందరికీ కావాలి నేను . నేనెవరిని? 


2. తల లేదు మొల లేదు 

ధరణిలో తానున్నాడు 

చేతులున్నాయి కాని 

వాటికి వేళ్లు లేవు 


3. తలా తోకా ఉన్నా లేనట్లే 

నడుమూ శూన్యం 

నడవడానికి కాళ్లు లేవు 

ఐనా నడుస్తానంటుంది 

మూడారు దోవల బట్టి

పయనమై పోతుంది 


4. తల్లిని చంపి 

తరలి పోతుంది 


5. తిరుగు తిరుగు రాట్నమా 

తిరగాడు రాట్నమా 

అన్నదమ్ము లొస్తారు 

ఆడుకోవె జల్లేడ 


6. ఇటు నుంచి చూస్తే చేపలు పట్టేందుకు ఉపయోగపడే సాధనం 

అటు నుంచి చూస్తే ఆడవాళ్లకు ఉపయోగ పడే సాధనం 


7. ఆలు కాని ఆలు 


8. ఎత్తుకొనేదాకా అరచి గీపెట్టే అల్లరి పిల్ల 


9. నన్నెత్తు కుంటే దారి చూపుతాను కాని  తోడు  లేకుండా నడవ లేను 


10. వంక గాని వంక

Comments