మెదడుకు మేత - 29
1 .కర్రలున్న చెట్టు కర్రలనిండా కాయలు కాయను కోస్తే కూరకొస్తుంది
2 .లంకల్లొ పెరిగేటి డొంకలను కోసి - మాగేసి మగ్గేసి చదునుగా చేసి - ఊదని బూరాలు కాల్చి వేస్తారు - మింగని సారాన్ని ఉమ్మి వేస్తారు
3 .రాణి అంటే రాణి కాదు
రాత్రులు రాజ్యం ఏల్తుంది
చక్కని కమ్మని విందుకు పిలిచి
ముక్కుకు పండుగ చేస్తుంది
4 .కోట కాని కోట ఇంటికో కోట
కోటలో ఉంటుంది మేటి రాజీవి
వైద్యం కోసం వైద్యులు వస్తే
నైవేద్యం కోసం పిల్లలు వస్తారు
5..ఇక్కడ కట్టిన కట్లు ఇనప కట్లు- మద్దూరి చెరువులో మాయమై పోయె
6 .వీధిలో పెద్ద మనిషి - వికారపు మనిషి - ఒకరొస్తే లేవడు - ఇద్దరోస్తే లేస్తాడు
7 .కుంటలో ఉంటుంది కొంటె గుంట- బొమిక లైనా లేని బొడి గుంట
8 .దమ్మిడీ గుర్రం దుమ్ము రేపింది
9 .ముక్కు నలుపు చెక్కు లెరుపు
10 .ఆకాశ రామన్న రసగుండ్లు రాల్చితే - తినలేని బాపనయ్య తిరిగి చూశాడు
Comments
Post a Comment