ఆకలి

 కవిత

ఆకలి

ఊహా శక్తితో నిండిన చిన్నారుల మనసులో ప్రపంచం ఒక అద్భుత కథ
ప్రతి చెట్టూ ఒక ఇంద్ర భవనం
ప్రతి రాయి ఒక రహస్యం
ప్రతి జంతువూ ఒక స్నేహితుడు
నిష్కల్మషమైన ఆనందం
స్వేచ్చగా ఆడుకొనే హక్కు
అమాయకపు ప్రశ్నలు
కాలం గడిచి పోయినా
బాల్యం దూరమైనా
జ్ఞాపకాలు పదిలం
గర్భంలోనే గుర్తించిన ఆకలి
పుట్టింది మొదలు వెంటాడే భయం
గుప్పెడు మెతుకుల కోసం
కళ్ళలో మెరిసే ఆశల వెలుగు
నిశ్శబ్దంగా గుస గుస లాడే ఆత్మలు
సమాజానికి సమాధానం లేని ప్రశ్నలు
అణు బాంబుల తయారీకి
కారణాలు వెదికే అమాయకత్వం  విశాలమయిన ఆకాశం కింద
ఆశాభరిత ఊపిరితో
గుమికూడిన పిల్లలు
పంక్తి ముందు ఆశగా కూర్చున్న కుక్క
ఆకలిని పంచుకొనే క్షణంలో
ఐక్యత దృశ్యం
ఆశ నిలబడే ఉంటుంది

మహాసముద్రం దేవకి 

Comments