పూల సోయగాలు

 కవిత


పూల సోయగాలు

రంగుల పూల తోటలో ఇంపైన సుగంధాలను వెదజల్లే అందమైన పూల బాలలు
కళ్ళు విప్పి చూస్తే కథలు వినిపిస్తాయి
చేమంతులు చంపకాలు
అరవిరిసిన మల్లె మొగ్గలు
ముద్ద బంతి పూల మురిపాలు లు
మందారాల వయ్యారాలు
సన్న జాజులు  సంపెంగల సల్లాపాలు
ఎరుపు  పసుపు నీలం నారింజ తెలుపు గులాబీ
రంగు రంగుల పూలతో తెరలు తెరలుగా విరిసిన తోట
చీమలు దోమలు తూనీగలు తుమ్మెదలు
గోరింకలు రాచిలుకలు పూల మధ్యలో తిరుగుతూ
మధువు లోలకబోస్తూ రొద చేస్తూ ఆనందంగా
పక్షులు చెట్లపై కూర్చోని పూల సౌందర్యాన్ని వీక్షిస్తూ
ఆస్వాదిస్తూ మధురంగా కిలకిలా రావాలు చేస్తున్నాయి.
అమ్మ ప్రేమను తలపించే మెత్తటి పూరేకుల స్పర్శ
అమితానందాన్నిచ్చే అద్భుతమైన అనుభూతి
పూలు కావాలి పూజలకు అలంకరణలకు
వాసన ద్రవ్యాలకు సౌందర్య సాధనాలకు
ప్రకృతి అందానికి చిహ్నం పూలు
పర్యావరణానికి గొడ్డలి పెట్టు
పరాగ సంపర్కానికి పనికి వచ్చు
ప్రపంచంలోనే పేద్దపువ్వు మీటరు వ్యాసమున్న
సుమత్రా రాసెల్ఫియా
అతి చిన్న పువ్వు అరంగుళం కన్న తక్కువగా 
వొదిగి ఉన్న వోల్పియాl
4000 ఏండ్లకు ముందునుంచి ఉన్నది
ప్రేమకు చిహ్నంగా నిలిచి ఉన్న గులాబీ
మనసుకు హాయిని ఆనందాన్ని ఆహ్లాదాన్ని
శాంతిని సౌభాగ్యాన్ని ఇచ్చే
రంగుల పూలతో విలసిల్లుతోంది ప్రకృతి అందం

మహాసముద్రం దేవకి



Comments