కవిత
అడవి అందాలు
అది చీమలు దూరని చిట్టడవి
కాకులు దూరని కారడవి
సూర్య రశ్మీ తాకని నేల
పెద్ద చెట్ల శాఖలు కప్పి ఉంచాయి గుడారంలా ఆకాశాన్ని
అడవి నేలపై చిమ్ముతోంది చల్లని ఆకు పచ్చని కాంతిని
చిత్తడి నేల
ఆకులు కుళ్లిన వాసన
పక్షులు కొమ్మల్లపై కూర్చొని పాటలు పాడుతుంటాయి
కీటకాల గుసగుసలు ఆకుల మధ్య
చిన్న జంతువులు నేలపై నడుస్తుంటే
వాటి పాదాల శబ్దాలు రాలిన ఆకుల పరుపుపై
మృదువుగా మ్రోగుతూ
దట్టమైన అడవి ఒక రహస్య ప్రదేశం
ప్రతి మలుపు వద్ద ఆశ్చర్యాల ఆనవాళ్లు
ఒక పూల మొక్క రాతిపై వికసిస్తుంది
దాని రంగులు సూర్య రశ్మి కోసం పడే ఆరాటం
ఒక చిన్న జలపాతం రహస్య గుహలోకి దిగుతూ
దాని నీరు స్పష్ట మైన రాతి పై మెరుస్తూ
ఒక పురాతన చెట్టు శతాబ్దాలుగా నిలిచి ఉంది
దాని శాఖలు వృద్దుని జ్ఞానాన్ని కలిగి ఉంది
అది శక్తి వంత మైన ప్రదేశం
ప్రతి చెట్టుకూ పైకి ఎదగాలనే ఆరాటం
దాని చూపులు ఎప్పుడూ ఆకాశం వైపే
సూర్యుని నుండి శక్తిని తీసుకుంటూ
భూమి నుండి పోషకాలను గ్రహిస్తూ
అందమైన ఆకులుగా పూలుగా పండ్లగా మారుస్తూ
జంతువులు ఒకదాని నొకటి తింటాయి
జీవిత చక్రం లో భాగమై బలాన్ని జ్ఞానాన్ని బదిలీ చేస్తాయి
దట్టమైన అడవి ప్రకృతి మాత అద్భుతాలను చూడగల అందమైన ప్రదేశం
ప్రతి మాను ప్రతి మొక్క ప్రతి పక్షి ప్రతి జంతువూ
చీమ దోమా పామూ జెర్రీ
ప్రతి ప్రాణీ ఒక కథను చెబుతుంది
అది భూమిపైన సంక్లిష్ట మైన వెబ్ లో ఒక భాగం
భూమిపై జీవించే అద్భుతాలను చూడాలన్నా వినాలన్నా
అడవి చూపిస్తుంది సుందర దృశ్యాలను
అడవి వినిపిస్తుంది ఆ అద్భుత కథలను
మహాసముద్రం దేవకి
26 - 6 - 2024
Comments
Post a Comment