కవిత
రాజకీయ నాయకుడునిన్ను పట్ట పగ్గాల్లేవని పట్ట పగలే వికటాట్ట హాసం చేస్తావ్.
అధికారం ఉంది కదా అని
పగ్గాలేసి పట్టుకొని ఒక్కొక్కరిని ఒక్కో ఆట ఆడిస్తావ్
కొందర్ని ఉరికి వేళాడ దీస్తావ్
కొందర్ని కీలు బొమ్మల్ని చేసి ఆడిస్తావ్
కొందరిని అదరేస్తావ్
మరికొందరిని బెదిరిస్తావ్
పోలీసు యంత్రాంగాన్ని సైతం
నీ చెప్పు చేతల్లో ఉంచుకోవాలను కుంటావ్
న్యాయాన్ని, ధర్మాన్ని ఆచరించే వాళ్ళను
బదిలీ పేరుతో ముప్పు తిప్పలు పెడతావ్
నీ అధికారం మేము పెట్టిన భిక్షే అన్నది మరచి పోతావ్
కుయ్యో మొర్రో అని అందరి కాళ్లూ పట్టుకొని
నీ అధికారం మేము పెట్టిన భిక్షే అన్నది మరచి పోతావ్
కుయ్యో మొర్రో అని అందరి కాళ్లూ పట్టుకొని
అందలమెక్కిన నువ్వు
ఏరు దాటి నాక తెప్ప తగలేస్తావ్
అంతా నా చేతి లోనే ఉందని విర్ర వీగుతావ్
ఎన్నాళ్లు లే నీ వికృత చేష్టలు
పిల్లి కూడా పులై తిరగ పడుతుంది
చీమలు కూడా విషపురుగయిన పామును
చుట్టు ముట్టి చంపేస్తాయ్
సామాన్యుని విరాట్రూపం చూస్తేనే
నీ గుండె ఆగి పోతుంది
పిరికి వాడై పలాయణం చిత్తగించే నిన్ను వెదికి పట్టుకొని
తరిమి తరిమి నీ నోట్లో తడి ఆరిపొయ్యేలా చేస్తాం
చెడు ఎప్పుడూ శిక్షార్హమే
మంచికి ఎప్పుడూ విజయమే గమ్యం
మహాసముద్రం దేవకి
ఏరు దాటి నాక తెప్ప తగలేస్తావ్
అంతా నా చేతి లోనే ఉందని విర్ర వీగుతావ్
ఎన్నాళ్లు లే నీ వికృత చేష్టలు
పిల్లి కూడా పులై తిరగ పడుతుంది
చీమలు కూడా విషపురుగయిన పామును
చుట్టు ముట్టి చంపేస్తాయ్
సామాన్యుని విరాట్రూపం చూస్తేనే
నీ గుండె ఆగి పోతుంది
పిరికి వాడై పలాయణం చిత్తగించే నిన్ను వెదికి పట్టుకొని
తరిమి తరిమి నీ నోట్లో తడి ఆరిపొయ్యేలా చేస్తాం
చెడు ఎప్పుడూ శిక్షార్హమే
మంచికి ఎప్పుడూ విజయమే గమ్యం
మహాసముద్రం దేవకి
Comments
Post a Comment