ఆదిలోనే హంస పాదు

 ఆదిలోనే హంస పాదు


రాసేటప్పిడు అక్షరం తప్పు అనిపించిన చోట హంసపాదం ఆకారంలో ( ఇంటు ) గుర్తు పెట్టే వాళ్లు. ఇది వాక్యం మధ్యలో వస్తే ఇబ్బంది ఉండదు.  కానీ మొదట్లోనే వస్తే అది ఆ కవి అసమర్థత కింద లెక్క. ఆదిలోనే అభ్యంతరం వస్తే దాన్ని అపశకునంగా భావించే వాళ్లు. దీని వెనక ఉన్న కథ:

నెల్లూరు పండితుడు నేలటూరి పార్థసారథి అయ్యంగారు. భారతం లోని ఉద్యోగ, స్త్రీ, శాంతి పర్వాలకు టీకా తాత్పర్యాలు  రాశారాయన. మొదటి పద్యం ' శ్రీయన గౌరి నాబరగు ' అనే పద్యంలో గౌరి కి అర్థం చెప్పకుండా వదిలేశారాయన. దానిని చూసి పూండ్ల రామకృష్ణయ్య గారు ' అముద్రిత గ్రంథ చింతామణి ' పత్రికలో ' ఆమ్నాయ కళానిధికి ఆది లోనే హంసపాదు ' అనే శీర్షికతో విమర్శించారు. ఈ సామెత అప్పటి నుంచి ప్రచారానికి వచ్చింది. ఏదయినా పని మొదలు పెట్టినప్పుడు ఆటంకం ఏర్పడి ఆ పని సజావుగా సాగ కుంటే ' ఆదిలోనే హంసపాదం అని వాపోతారు. అదే వ్యవహారం పాదం కాస్తా ' పాదు ' అయిపోయింది .

మహాసముద్రం  దేవకి 

Comments