పింగళి వారి పేకి
పింగళి సూరన పేరు మన అందరికీ తెలుసు కదా! అతని వంశానికి మూల పురుషుడు గోకర్ణ రాజు . అతనిని గోక మంత్రి అని కూడా అంటారు. ఆయన గొప్ప తపస్వి . మంత్ర తంత్రాల్లో ఆరి తేరిన వాడు.
ఆయన తన మంత్ర శక్తితో ఒక దెయ్యాన్ని వశపరుచుకొని దానితో సేవలు చేయించుకొనే వాడు . దానికి ఎప్పుడూ ఏదో ఒక పని చెప్తూ ఉండాలి. ఖళీగా ఉంటే ఏదో ఒక వెధవ పని చేసి నెత్తికి తెచ్చి పెడుతుంది. ఎంత కష్ట సాధ్యమైన పని చెప్పినా అది చిటికలో చేసేసేది. చేయించడానికి ఏ పనీ లేక చాలా ఇబ్బంది పడేవాడాయన. చివరికి ఆ దెయ్యాన్ని ఎలా వదిలించుకోవాల అన్నది ఆయనకు పెద్ద సమస్య అయి కూర్చుంది.
దానికి చేత కాని పని ఏదయినా చెప్పాలని చాలా ఆలోచించాడాయన. చివకి వంకీలుగా ఉండే ఒక తల వెంట్రుకనిచ్చి దానిని వంకీలు లేకుండా సాఫీగా చేసివ్వమన్నాడు.
అది వెంట్రుకను సాగదియ్యడం మొదలు పెట్టింది. ఎంత సాగదీసినా వదిలేసరికి యధాప్రకారం చుట్టుకు పోతోందా వెంట్రుక . ఒక రెండు రోజులు ప్రయత్నించింది. మిగిలిన పనులన్నీ అలాగే ఉన్నాయి. దానికి విసుగు పుట్టింది. ఈ పని తనకు సాధ్య మయ్యేది కాదని అర్థం చేసుకుంది. ఎవరితోనూ చెప్పీ పెట్ట కుండా ఉడాయించింది.
అప్పటి నుండి పింగళి వారి పేకి అనే సామెత వాడుకలోకి వచ్చింది. ఎంత చెప్పినా వినకుండా వెంట పడి వేదించే వాళ్లను , మంకు పట్టు పట్టే వాళ్లను ' పింగళి వారి పేకిలా తగులుకున్నావే ' అంటుంటారు .
దేవకి
Comments
Post a Comment