కరటక దమనకులు
పాటలీ పుత్ర రాజు సుదర్శనుడు. మూర్ఖులయిన అతని కుమారులను కేవలం కథల ద్వారా ఆరు నెలలలో సకల నీతికోవిదులుగా తాయారు చేసిన విష్ణుశర్మ గురించి వినే ఉంటారు. ఆయన చెప్పిన కథలే పంచతంత్ర కథలు. వ్యక్తిగత, సాంఘిక, రాజనీతి తంత్రాలతో కూడిన ఆ కథలు అయిదు భాగాలుగా విభజించబడి పంచతంత్ర కథల పేరుతో విశేష ప్రచారాన్ని పొందాయి.
మిత్ర భేదం అనే అనే భాగంలోని కథఇది. ఒక అడవిలో కరటక దమనకులనే రెండు నక్క లుంటాయి. అవి ఆ అడవికి రారాజయిన పింగలకుడికి సలహాదారులుగా ఉంటూ మంచి మాటలతో అతడిని వంచించి కుయుక్తులతో, స్వార్థపూరితాలయిన సలహాలతో అతడిని వంచించి పబ్బం గడుపుకొనేవి.
ఒకనాడు వనంలో సంచరిస్తున్న సంజీవకుడు అనే ఎద్దు రంకె విని పింగళకుడు భయపడతాడు. కరటకదమనకులు అతని భయాన్ని పోగొట్టి సంజీవకునికి , పింగళకునికి మైత్రి ఏర్పరచి రాజు మెప్పు పొంది అతని కొలువులో పదవులు సంపాదించాయి. తర్వాత వాళ్ల మైత్రిని అధికం కావడాం చూసి ఓర్వలేక శత్రుత్వం కల్పించి
సింహంతో ఎద్దును చంపించాయి.
మెరమెచ్చు మాయ మాటలతో కుయుక్తులు పన్ని మంచి వాళ్లుగా చెలామణి అవుతూ పబ్బం గడిపే వాళ్ల నిజస్వారుపాలు తెలిసిన వాళ్లు ఏ ఇద్దరి దుర్మార్గుల మధ్య మైత్రి సాధ్యమయి అలాంటి పనులు చేసే వాళ్లను ఉద్దేశించి 'వాళ్లా కరటక దమనకులు' అంటుంటారు.
మహాసముద్రం దేవకి
Comments
Post a Comment