ధృతరాష్ట్ర కౌగిలి
కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులంతా పాండవుల చేతిలో మరణించారు. పుత్ర శోకంతో ఉన్న ధృతరాష్ట్రుడిని , గాంధారిని పరామర్శించడానికి శ్రీ కృష్ణుడు పాండవులతో సహా వచ్చాడు. ' నాయనా భీమ సేనా! నిన్ను చూస్తే నాకు నా పెద్ద కొడుకు దుర్యోధనుని చూసినట్లుంటుంది. ఒక సారి ఇలా రా నాయనా ' అని ఎంతో ప్రేమ ఒలకబోస్తూ పిలిచాడు. కృష్ణుడు వెళ్ల బోతున్న భీముని సైగ చేసి వారించి దుర్యోధనుడు యుద్ధ సాధనలో వాడిన భీముని ఇనప విగ్రహాన్ని ధృతరాష్ట్రుని ముందుంచాడు. అతడు ఆ విగ్రహాన్ని తడిమి చూసి భీముడని భ్రమించి గట్టిగా కౌగిలిలో బంధించాడు. ఇనప విగ్రహం నుగ్గు నుగ్గయి పోయింది. పాండవులు ఆశ్చర్య పోయారు. ధృతరాష్ట్రుడు భీముడు తన చేతిలో మరణించాడని దఃఖం నటించాడు. అప్పుడు పుట్టిందీ సామెత . పైకి ప్రేమ నటిస్తూ చెడు చెయ్యాలనుకొనే విడిపించుకోలేని నాశనకరమైన బంధాన్ని ఈ సామెతతో పోలుస్తారు.
మహాసముద్రం దేవకి
Comments
Post a Comment