శెట్టి సింగారించే సరికి పట్నం కొల్ల బోయింది
శెట్టి ప్రతి ఊరికి అవసరం. కావలసిన వస్తువులు మనకు శెట్టి ద్వారా లభిస్తాయి. అతని వల్లనే వ్యాపారం సజావుగా సాగుతుంది. శెట్టి ఉన్న ఊరిని పట్నం లా భావించే వాళ్లు. ' ఏనుగు మెట్టిందే సందు - శెట్టి వుండేదే పట్నం అనె సామెత ఊరికే రాలేదు . కాని శెట్టి సింగారానికి పట్నం కొల్ల బోవడానికి ఏమిటి సంబంధం?
ఈ సామెతలోని శెట్టి జెట్టి అయివుంటుందని అది వ్యవహారంలో అలా మారిందని కొంత మంది అభిప్రాయం. పూర్వం ప్రతి రాజాస్థానం లోను జెట్టీలు ఉండే వారు . రాజ వంశీయులకు, ఇతరులకు కుస్తీలు నేర్పడం., ఇతర రాజాస్థానాల నుంచి పోటీకి వచ్చిన మల్లులను ఓడించి రాజ్యానికి పేరు తేవడం, శత్రువులు ముట్టడించినప్పుడు వాళ్లను ఓడించడం
వాళ్ల పని.
ఇలాంటి జెట్టీ ఒకడు రాజధాని పై ముట్టడి చేసినప్పుడు జాగు చేశాడు. వీరులయిన వీళ్లను అమ్మాయిలు మోహించే వాళ్లు . అలా రాజకుమార్తె ప్రేమలో పడ్డ జెట్టీ సింగారానికి ఎక్కువ సమయాన్ని కేటాయించే వాడు. ఈ జెట్టీ తన ఆయుధాలు సర్దుకొని సింగారించుకొంటుండగానే శత్రు రాజులు పట్నాన్ని కొల్ల గొట్టారు. ఈ కథ వాడ వాడలకు ప్రాకి నానుడిగా నిలిచి పోయింది.
ఎవరయినా ఏ పనిలో అయినా జాప్యం చేస్తే ఈ సామెత ద్వారా ఆట పట్టించడం లేదా నిరసన తెలపడం మామూలయింది.
మహాసముద్రం దేవకి
Comments
Post a Comment