కోతి పుండు బ్రహ్మాండం

 కోతి  పుండు బ్రహ్మాండం


కోతులు గుంపులుగానే సంచరిస్తుంటాయి. అలా తిరిగేటప్పుడు ఏ కారణం వల్లనైనా కోతికి గాయమయితే మిగిలిన కోతులు దానిని పరామర్శ పేరుతో తన చేతి గోళ్లతో ఆ గాయాన్ని గోకి చూసి ఏదో ఆకు తెచ్చి దాని మీద వేసి వెళ్తుంటాయి. తమ సానుభూతిని, ప్రేమను అలా వ్యకం చేస్తాయవి. ప్రతి కోతీ ఆ గాయాన్ని కెలకడం వల్ల అది పెద్దదై విస్తరిస్తుంది. ఆ కారణం వల్ల ఈ సామెత వాడుకలోకి వచ్చింది. ప్రేమతో చేసినా చివరికి అది బెడిసి కొట్టి బాధకలిగించి నప్పుడు ఈ సామెతను వాడతారు .

మహాసముద్రం దేవకి

Comments