సామెత - పుట్టుక
పుట్టు పూర్వోత్తరాలు
పుట్టు పూర్వోత్తరాలు
ఉడతా భక్తి
హనుమంతుని ద్వారా రాముడు సీత రావణుని రాజ్యమయిన లంకలో ఉందని తెలుసుకున్నాడు. వానర సైన్యంతో సముద్ర తీరం చేరుకున్నాడు. దారి వదలమని సముద్రుని ప్రార్తించాడు. సముద్రుడు తనపై సేతువు నిర్మిస్తే మునగకుండా చూస్తానన్నాడు. వానర సైన్యం లో విశ్వకర్మ పుత్రుడు నలుడు ఉన్నాడని అతనికి ఆ పని అప్పగించమని సముద్రుడు సలహా కూడా ఇచ్చాడు. నిర్మాణం మొదలయింది. సమీపంలో ఉన్న ఒక ఉడుత అదంతా చూసి రాముని మీది భక్తితో తన తోకను నీటిలో ముంచి ఇసుకలో పొర్లించి నిర్మిస్తున్న వారధి పై తన తోకను దులప సాగింది. అది చూసిన రాముడు సంతోషం పట్ట లేక ఉడతను అరిచేతిలోకి తీసుకొని దాని వీపుపై ప్రేమతో మూడు వేళ్లతో నిమిరాడు. దాని వీపు మీద మూడు చారలు ఏర్పడి దాని భక్తికి గుర్తుగా ఆ జాతిలో ఆ చారలు శాశ్వతంగా ఉండి పోయాయి. ఈ కథ ఆధారంగా ' ఉడతా భక్తి 'అనే సామెత వాడుక లోకి వచ్చింది. చిన్న సాయమైనా తమ చేత నయిన రీతిలో ప్రకటించుకోవడాన్ని తెలియజెప్పేందుకు ఈ సామెతను వాడతారు .

Comments
Post a Comment