సామెతల పుట్టు పూర్వోత్త రాలు :
సామెతల ఎప్పుడు పుట్టాయో ఎలా విస్తరించాయో చెప్పడం కష్టమే. వివేక వంతుడయిన వ్యక్తి తాను చెప్పాలను కున్న విషయాన్ని వివరించకుండా ఒక చిన్న వాక్యంతో తన మనసులోని భావాన్ని వ్యక్తీకరిస్తే అది విన్న వాళ్ళు అలాంటి సందర్భం వాళ్లకు ఎదురయినప్పుడు ఆ వాక్యాన్ని వాడుకుంటే అలా పరంపరగా ఆ వాక్యం మళ్ళీ మళ్ళీ వాడబడి సామెతగా నిలదొక్కు కుంది . ఎన్నో తరాలుగా వ్యాప్తి లో ఉన్న సామెతల పుట్టుకను కాంతితో చూడకుండా , చెవితో వినకుండా ఆధారాలు లేకుండా చెప్పడం సాధ్యం కాదు .ఒక వాట్సాప్ సమూహం వాళ్ళు నన్ను సామెతల పుట్టుకను చెప్ప మన్నప్పుడు కాదన లేక నాకు తోచిన ఊహాల నుంచి పుట్టిన కల్పితాం శాలు ఇవి . పురనేటి హాసాల నుంచి పుట్టిన సామెతలను ఇది వరకే కొందరు చెప్పారు .దాన్ని కూడా వాడుకున్నాను .కానీ వీటిలో నేను ఊహించి చెప్పినవే ఎక్కువ.
Comments
Post a Comment