అబద్దాల పంచాంగానికి 66 గడియలు త్యాజ్యము

 అబద్దాల పంచాంగానికి 66 గడియలు త్యాజ్యము


ఒక గంట =21/2 గడియలు . తిథి, వారం , నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంశాల గురించి చెప్పేది పంచాంగం . క్షవరం చేసుకోవడానికి కూడా తిథి వార నక్షత్రాలను చూసే వాళ్లున్నారు. అలాంటి వాళ్లకు చెంప పెట్టు ఈ సామెత.

పంచాంగం చూడ్డం రాని శుంఠ అయిన పండిత పుత్రుని గురించి ఈ సామెత పుట్టి ఉంటుంది. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకున్నట్లు తాత ముత్తాతల పేరు చెప్పుకొని పబ్బం గడుపుతున్న వాడు మీన మేషాలు లెక్క పెట్టి 66 గడియలు దాటిన తర్వాత మంచి ముహూర్తం ఉందని చెప్పడం ద్వారా పంచాంగం చూడ్డంలో దిట్ట అనిపించుకోవడం. అంత పెద్ద పంచాంగం చంకలో పెట్టుకొని పంచాంగం చూడ లేవా అంటారని గడియలతో కూడా చెప్పడం. ' పగ వాణ్ణి పంచాంగం అడిగితే మధ్యాహ్నానికి మరణం' అన్నాడని సమయానికి  ఏదో చెప్పి పబ్బం గడుపుకోవడం. ఎదుటి వాళ్ళను నమ్మించడానికి చేసే ప్రయత్నం .

ఇది రాని విద్యను వచ్చినట్లు నటించే వాళ్ళను ఉద్దేశించి  పుట్టిన ( చెప్పిన)  సామెత అయి ఉండ వచ్చు .

దీని గురించి నాకూ తెలియదు.ఇది కేవలం నా ఊహ మాత్రమే

మహాసముద్రం దేవకి

Comments