మెదడుకు మేత - 39

 మెదడుకు మేత - 39


   1  .పాట పాడు గాని ప్రాణంబు మరి సున్న 

        మాటలాడ తనకు నోరు లేదు 

        గాలి భుక్తి అయ్యె గాలించి మరి చూడ 

        దీని భావ మేమి తిరుమలేశ 


   2 .తపము లేల అధిక దాన ధర్మము లేల 

        యజ్ఞ మేల గొప్ప యాగ మేల 

        సర్వ కార్యములకు సాటి నేనౌదురా 

        నాదు నామ మేమి నాణ్య కాడ 


   3 .కాళ్లు లేవు కాని కలకత్త అది పోవు 

        విరగ బడును జనము వెళ్లగానె 

        పండ్ల గంప గాదు బంగార మది కాదు 

        నాదు పేరు జెప్పు నాణ్య కాడ 


   4 .నేను చెప్పు మాటలెల్ల తా గొంపోయి 

        తెలియ జెప్పు చుండు తెలివి గలిగి 

        రూపు రేఖ లేదు చూపులా హుళక్కి 

        దీని భావ మేమి తెలుపు బాల 


    5 .దిన దినంబు రెండు తేపలు కరములు 

        రెండు శిరము జేర్చి ప్రీతి మొక్కు 

        నరుడు కాదు వాడు నరునుచే జన్మించె 

        దీని భావ మేమి తెలుపు బాల 


  .   6 . చలన శక్తి కలది జంతువు కాదది 

        చేతు లెపుడు దిప్పు శిశువు కాదు 

        కాళ్లు లేవు సర్వ కాలంబు నడచును 

        దీని పేరు చెప్పు తెలుగు బాల 


   7 .బరువు మోతును గాని బండిని నే కాదు 

        కాళ్లు నాలుగున్న కదల లేను 

        చేతులున్న గాని చేజాల నేపని 

        తెలుగు బిడ్డ నన్ను తెలుప గలవ 


   8  .గాలి గండమె కాని నీటి గండము లేదు 

        దేవతా రూపమై తిరుగుతుంది 

        పగ బూని శత్రువును నోరార మింగితే 

        చావు పాలవుతుంది చిత్రమండి 


   9 .ఆకసమున తిరుగు కాదు అండజ మది 

        చేప వలె ఉండు నీదదు  చేప వలెను 

        చక్రములు కలుగు అది కాదు జట్క బండి 

        దీని పేరు జెప్పు తెలుగు బిడ్డ 


   10. కొమ్ము లుండు గాని కోడె దూడ కాదు 

        వీపు నందు మూట వీడ కుండు 

        తనను తాకి నంత దాగి కొను చుండును 

        దొంగ కాదు మరియు దోషి కాదు 


        

        

       

Comments