మెదడుకు మేత - 36

 మెదడుకు మేత - 36


1. జనక్ జనక్ పిల్ల వాడు 

వాడి నడుముకు మూరెడు తాడు 

వాడు లేకుంటే ఊరంతా పాడు 


2. జీడీ వారి  కోడలు 

సిరిగల వారి ఆడ పడుచు 

వయసున కులికే వయ్యారి 

వైశాఖ మాసాన వస్తుంది ( ఇది రోహిణి, వసుంధర చెప్ప రాదు ) 


3. జీవం లేని గుర్ర మెక్కి 

జట్కా కోల చేత బట్టి 

ఆకుల్లేని అడవిలోకి 

వేటకు బోయాడు 


4. జేబులో తానుంటే ఇంకొకరిని ఉండనీయదు 


5. తళుకు బెళుకు వన్నె లాడి 

చూడ్డానికెంతో వగలాడి 

జారుతుందేమో ఆ పూబోడి 


6. దబ దబాని వాన కురిసె 

గొయ్యి నిండ మన్ను చేరె 

రాజా వారు చక్రం తిప్పె 

కుప్పెసి నిప్పు పెట్టె 

కుప్ప కాలి పోగానే 

అప్పులన్ని తీరి పోయె


7. అడవిలో అక్కమ్మ కత్తులు మారుతుంది


8. డొంకలో పడుకోనుందొక మెలికల పాము 

లోయలో ఉందొక ఇంపైన పనస తొన 

దోవలో 


9. తండ్రిని చంపింది 

తాతను కూడింది 

తండ్రిని కనింది 

తలోదరి 


10. సుద్దుల మోపు 

నడుముకు వడ్డాణం 

చేసేది పాచి పని

Comments