మెదడుకు మేత - 32

 మెదడుకు మేత - 32


అ కారంతో మొదలయ్యే పొడుపులు 


1 .అమ్మ పడుకుందే చాలని కూతురు గిర గిరా రంగుల రాట్నం తిరుగుతోంది 


2.అంగులం ఆకు అడుగున్నర కాయ 


3. అడుగులున్నాయి కానీ కాళ్లు లేవు .


4 .అడవిలో పుట్టింది- అక్కడే పెరిగింది- మా యింటి కొచ్చింది- మహలక్ష్మిలాగుంది 


5 .అత్తా ఓ మేనత్తా నువ్వొస్తేనే నే నొస్తా నత్తా 


6 .అడవిలో పుట్టాను మేదరింట్లో  మెట్టాను ఒంటి నిండా గాయాలు కడుపునిండా రాగాలు 


7. అల్లు డొచ్చాడు చొక్కా విప్పాడు నూతిలో దూకాడు 

అడవిలో అక్కమ్మ ఆసు బోసింది 


8 .అన్నం తిన్న తర్వాత గోడకు చేరుతుంది 


9 .అడ్డానికి కోసి చక్రం తిప్పు నిలువుకు కోసి శంఖం ఊదు 


10 .అడవిలో సీతమ్మ ముగ్గేసింది 


11 .అవతల కొండ ఇవతల కొండ మధ్యలో నీళ్లు

 

12 .అంక పొంకాలు లేని దాన్ని అందరు మెచ్చి చేస్తారు పూజ 


13.అంకి రెడ్డి గారి ఎద్దు కొమ్ము పట్టుకోగానే తట్టె డిస్తుంది 


14. అటు ఇటు ముళ్ల కంచెలు మధ్యలో దారి 


15 .అప్పడం గిప్పడం నా అత్త గారి కొప్పులో కోతి పిల్ల 


15. అరచేయంత మడి పెసర కాయంత గెనిమ తడి ఆర కుండా నీళ్లు కట్టవే ఇంటి ఇల్లాలా 


16. అయ్య కొమ్ముల మారి అమ్మ గిచ్చుల మారి బిడ్డలు రత్న మాణిక్యాలు 

17 .అంగట్లో అమ్మేది కాదు తక్కెట్లో పెట్టి తూచేదీ కాదు అది తెచ్చుకోకుంటే పండగే అవదు

 

18 .అమ్మ అంటే పరిగెత్తి వచ్చి కర్చుకుంటుంది అయ్యా అన్నావా ఆమడ దూరం పరిగెడుతుంది

Comments