గుండ్లపల్లి ఆచారి - మాండలిక కథ

వరిగ పల్లె ముచ్చట్లు -11

గుండ్లపల్లి ఆచారి

        మా ఊరికి సుట్టపు సూపుగా అడపా దడపా వొచ్చి పొయ్యే వాళ్లలో గుండ్లపల్లి ఆచారి మామ ఒకడు.

        ఆ ఆచారి మామొచ్చినాడంటే అందురి సంగతేమో గాని నాకు మాత్రం గొబ్బియ్యాల పండగొచ్చినంత సంబరంగా ఉంటాది.

        బక్క పల్చగా చామన చాయతో మొగం నిండా అమ్మ కణాలతో , చెవులకు పోగులు బెట్టుకోని శానా తమాసగా ఉంటాడు సూడ్డానికి .

        అంతేనా! ఆచారి  మామకు ఆచారాలెక్కువ. చాదస్తా లంత కంటే జాస్తే . తన సామాన్ల మూటతో బాటు ఎక్కడికి వొచ్చినా వాటినీ మూట గట్టుకొని వొస్తాడు.

        పసుపు, నూని సాయి రంగుల పంచలు కట్టు కుంటాడు. ఏసుకొనే పొట్టి సేతుల తెల్ల సొక్కాయిలు రంగు మారి ముడతలు బడి పోయుంటాయి . 

        మాట్లాడతా ఉంటే  తమాసాగా ఆపుడప్పుడు కొన్ని అచ్చరాల్ని ముక్కు పట్టేసినట్లు గుక్కిళ్లు మింగతా మాట్లాడతాడు.

        కొన్నేండ్లకు ముందు ఒక సారి ఆచారి మామ మా ఇంటి కొచ్చినప్పుడు ఏం జరిగిందో సెప్తాను ఇనండి.
        
        ఒక  దినం అప్పుడే ఇస్కూలు నించి మద్యాన్నం అన్నం దిని పోవడానికి ఇంటికొస్తా ఉండానా ! మా ఇల్లు సేన్లో కట్టుకోవడం వల్ల ఊరిచివరగా రచ్చ బండ ఎనక పది బార్ల దూరంలో ఉంటాది. రచ్చబండకు అవతల జోడు తాటి మాన్లు. అదే మా ఇంటికి హద్దు. ఆడ మలుపు తిరిగినానో లేదో ఆచారి మామ మెల్లంగా అడుగు మింద అడుగు బెట్టు కుంటా మా ఇంటికి బోతా కనిపించినాడు.

        ఆయన్ని సూడంగానే నాకు శానా కుశాలయింది. గబ గబా ఆయన పక్కకు చేరి నడస్తా నన్ను గమనిస్తాడా లేదా అని సూస్తా ఉండా.

        ఒకసారి సూసి తలదిప్పుకున్న్యోడు మళ్లీ పక్కకు గెవనించి సూసి నన్ను గుర్తు బట్న్యాడు.

        ' ఏం పాపా అబ్బుడే బడి ఒదిలేసినారా ? ఎండ మిట మిట లాడి పోతా ఉందే! ' అని పలకరించినాడు. నవ్వినాను నేను.

        ' ఏం పాపా మాట్లాడవు బడి నించేనా? ' అడిగినాడు మళ్లీ

         ' అవును మామా'

        ' మరి పుస్తకాలేవి ?

        ' మద్యానమన్నానికి ఒదిలినారులే. మళ్లీ బోవాల' అని ఇంట్లోకి గెసబోసుకుంటా పరిగెత్తి ' అమా ఆచారి మామొస్తా ఉండాడు ' అన్న్యాను

        ' ఆచారి మామెవురు? ఎన్ని గుర్రాల మింద వస్తా ఉండాడు? అంత గెస బోసుకుంటా పరిగెత్తొచ్చి సెప్తా ఉండావు. ' అని అడిగింది మాయమ్మ సంగటికి పిండి బోస్తా .

         ' అదేమా అప్పు డప్పుడు మనింటి కొచ్చి బాడ్సి మాను కాడ అన్నమొండుకుంటాడే ఆ మామ '

        అప్పుడే '  కమలమ్మా' అంటా లోపల అడుగుపెట్నాడాయన.

         ' నువ్వా , బాగుండావా నా ? ' అని అడగతానే పెద్దింట్లోకి బోయి తలుపెనక సుట్టి పెట్టున్ని పాత సాప దెచ్చిచ్చింది.

        బుజానికున్ని జోలిని తాల్వారంలో ఒక మూల బెట్టి సాపతోనే తాల్వారాన్ని ఒక సారిట్లా ఒకసారట్లా ఇసిరి మళ్లీ దుమ్ము దుమ్ముగా ఉందను కున్యాడేమో ' కమలమ్మా పొరక్కొంచియి తల్లీ' అని అడిగినాడు.

        మాయమ్మ పొరక దెస్తే ఆ మామ అందుకో బొయినాడు. ' నువ్వుండు నా ' అని మాయమ్మే చెత్తోసి చాంతాడు బొక్కిని దెచ్చి ఆడ బెట్టి సంగటి కెలకను గుడ్సింట్లోకి దూరింది.

      కొంచిం దూరంగా కూసున్నా  నా కండ్లు మాత్రం ఆచారి మామ మిందే ఉండాయి. జోలి ఇప్పినాడు. సవకం ఇప్పి బుజమ్మింద ఏసుకున్న్యాడు. సేంతాడు బొక్కినీ తీసుకోని సేంద బాయి కాడికి బొయినాడు. నేను బొయ్యి బాయికి దెగ్గిరిగా ఇంటి ముందుండే దిన్ని మింద కూసున్న్యాను.

        మద్యానం పెద్దయివోరు పన్నెండు నించి పదారు దాకా ఎక్కాలొప్పించ మన్యాడు. పన్నెండు పదైదొచ్చు 13, 14, 16 శానా కష్టంగా  ఉండాది. ఇస్కూలుకు ఎట్లా ఎగనామం బెట్టాలా అని ఆలోచిస్తా ఉండా. ఆచారి మామను సూసినాక బిన్నిగా ఇస్కూలుకు బొయ్యి ఎక్కాలు సదుంకోవాలనుకున్ని ఆలోచన సంకెక్కింది.

        ఆచారి మామ తెచ్చిన సామాన్లు బాయికాడ బెట్టినాడు. సొక్కాయి ఇంట్లోనే తీసి పెట్టినట్లుండాడు. పంచి దీసి బాయిమిందేసి నీళ్లు సేంది నాలుగు బొక్కిన్ల నీళ్లు తల మింద కుమ్మరించుకున్న్యాడు. తువ్వాల్ని అడ్డ పంచి మాదిరిగా సుట్టుకొని సెడ్డీ పంచి మింద ఒక బొక్కిని  నీళ్లు కుమ్మరించి తప తపా ఉతికి నీళ్లలో అలిమి గెట్టింగా పిండి ఒక కొనను బాడ్సిమాను కొమ్మకు ఇంకో కొనను మందారం సెట్టు కొమ్మకు గట్టినాడు. సెడ్డీని మందారం కొమ్మ మిందేసినాడు.

        ' కొమ్మలిరిగి పోతాయి మామో 'అని పరిగెత్తినాను. నా పక్కకు గూడా సూడకుండా 'ఏమీ ఇరిగి పోవులే 'అన్న్యాడు.

        ' పాపా,  గిన్నిలో ఏసి పెట్న్యాను తిందుర్రండి. ఇస్కూలుకు టయమవుతాది. అబ్బోడేడ ' అని ఒచ్చింది మాయమ్మ. వాన్ని ఎతికే సాకుతో ఇస్కూలెగ్గొట్టి మామ సేసే పనుల్ని సూడొచ్చని నాకు అవుడియా ఒచ్చేసింది.

        ' అమా గోపి గాడు నేనెంత సెప్పినా ఇనకుండా సీనుగానెంట నేరేడు పండ్లేరక రాను అవ్వోళ్ల తోపు లోకి బొయినాడుమా ' అన్న్యానో లేదో మాయమ్మకు యాడలేని కోపమొచ్చేసింది.

        ఒక పక్క మా సేద్దిగాడు పొన్ను రంగడు బాయి కాడి కూలోళ్లకు సంగటి బెట్టియమని కాసుకోనుండాడు. ఇంగో పక్క ఆచారి మామ వంట సేసుకోను అదియ్యి ఇదియ్యి అని అడగతా ఉండాడు.

        ' ఒరే రంగా నువ్ బొయ్యి అబ్బోడేడ ఉండాడో సూసి పిల్సుకోని రాబో , ఈ లోపల నేను సంగటి గంప సర్ది పెడతా అనింది .
       
        కోపంగా ఉన్న్యప్పుడు ఇస్కూలుకు పోనంటిననుకో మాయమ్మ సింత బర్రెత్తుకొనేది కాయం. ఇస్కూలుకు బోతిననుకో పెద్దయివోరు బెత్తంతో కొడ్తే అరి సెయ్యి అప్పచ్చడుగుతాది. ఆచారి మామ అన్నం జేసుకొనేది సూడాలని శానా మునాసగా ఉండాది.

        ' కమలమ్మా తీరికేనా? ' అడిగినాడు మామ.

          ' నాకు తీరికేడుంటాది నా . నీకు తెలియదా ? సెప్పు నా ఏం కావాలో '

        అన్నం వొండే కంచు గుండాయి అట్లే సామాగ్రి కావాలమ్మా'

        ఎందుకో మా యమ్మ మొగం మింద కోపం పొయ్యి పెదాల మింద నవ్వు మొల్చింది.

        ' బాడ్సి సెట్టు కాడ సెత్తోసేసి వాదెడు కట్లె కూడా ఏసొచ్చినాను నా '

         బియ్యం పప్పు ఉప్పు సింత పండుతో సహా అన్నీ చాటలో పెట్టింది.

        'అంతంత ఇయ్యి . అన్నీ సట్టి కేసి ఒండుకోని తిని పారుకోని సస్తాడు. ' అన్న్యాను.

        ' చీ పాపిష్టి దానా , ఎవురయినా ఇంటే ఏమనుకుంటారు. సంగటి దిన మంటే నా యనకేం పని నీకు. పో! ' అని కసిరింది.

        అవిచ్చి దీగుట్లో వున్ని ముగ్గుపిండి గిన్ని దెచ్చి పేడతో అలికిన పొయిగెడ్డ మింద ముక్కర్రేసింది. .

        ఆచారి మామ పాత గుడ్డొకటి దెచ్చుకోని బియ్యం మొదులు కోని అన్నీ కొంచిం కొంచిం దీసి ఆ గుడ్డలో ఒకోటి ఒకో చోట మూట గట్టి పెట్టుకున్న్యాడు.

        ' ఆ సెత్తోనే అగ్గి కొంచిమియ్యి తల్లీ ' అని అడిగినాడు.

        మాయమ్మ మొగంలో ఏమాత్రం ఇసుగు లేదు. నన్ను పెళ్లో దాలి పొయ్యి దెగ్గిరుండే జల్లి గెంటి దెమ్మనింది.

       అగ్గిని పొయ్యి మద్దిలో ఏసి సన్న గోంకట్లిని ఇంచి దాని మింద బెట్టి ఉఫ్ ఉఫ్ అని ఊదతా  ఉండాడు. మొలక్కటుకున్ని తడి సవకం అక్కడక్కడా పొడి బారతా ఉండాది.

ఆచారి మామ గొంతుక్కూసోని ఒంగొంగి ఊదు బుర్రతో ఊదతా ఉంటే సవకం కొంచిం కొంచింగా పురుక్కు పురుక్కు మని సినగతా ఉండాది.

        ' ఆచారి మామా సవకం సినిగిపోతా ఉండాది సూడు ' అన్న్యాను.

        ' పాపా నీకింకేం పన్లేదా ? బడికి బోవా' అని కసిరినాడు.

        నేను బొయ్యి బొప్ప గిన్నిలో ఏసిన సంగటి పప్పు కూరా తెచ్చుకోని మదురు గోడ మింద కూసోని సంగటి తింటా ఉంటే మా యబ్బోడు, రంగడూ ఒచ్చినారు.

        నేరేడు పండ్లు జోబీలో ఏసుకోని సొక్కయంతా పాడుజేసుకున్న్యాడని మాయమ్మకు ఏడలేని కోపమొచ్చి వాన్ని తరుముకొనింది.

        రంగడు సంగటి గంప కోసం కాసుకోనుంటే గంప వాన్నెత్తిన బెట్టి ఒచ్చింది.

        సంగటి దిని గిన్నెంతా సుబ్బరంగా ఊడ్సుకోని నాకేసి గోడమింది నించి కిందికి దూకినాను . ఆచారి మామ దెచ్చుకున్ని బిందిలో చెంబు ముంచి నొట్లో బెట్టుకున్న్యానో లేదో !

        '' అయ్యో! అయ్యో !అపచారం కమలమ్మా , నీ కూతురేం జేసిందో సూడు తల్లీ ' అని మాయమ్మను పిల్సినాడు.

        ' ఏం పాపా  ఇదేనా మీయమ్మ నీకు నేర్పించింది. నేను మడి గట్టు కోని సేంది తెచ్చుకున్ని నీళ్లలో సెయి బెడ్తావా? సెంబు సగం నోటికి బెట్టుకొని ఆ నీళ్లు తాగడ మేంది?' అని గుడ్లురిమినాడు

        మాయమ్మ యాడ కొడ్తాదో అని ఉల్సరపొయినాను నేను . ఆచారి మామ అరుపులకు బయటికొచ్చిన మాయమ్మ. సంగతి తెల్సుకోని నా ఈప్మింద రొండంటించింది.

        ' మరి నువ్ గూడా నీళ్లు కర్సుకోనే గదా తాగేది .' మా యమ్మ మింద కసిగా ఉండాది.

          ' తాగితే అది మన చెంబు, మన నీళ్లు ' అనింది.

        ' ఇది గూడా మన చెంబు మన నీళ్లేమా' అన్న్యాను .
        
        ' పూజ కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్లు. అంటారు. నా కర్మ కొద్దీ పుట్న్యారు ఉపాతకం పిలకాయిలు. మొన్న బుట్టి నిన్న కండ్లు దెర్సిన పిలకాయిలు  కూడా ఎడ్డె మంటే తెడ్డెమంటా ఉంటే ఏ గంగలో బొయి దూంకాల . సేసే దంతా తలవంపులు దెచ్చే పనులే . మళ్లీ మాటలు సూడు.' నన్ను ఉరుమురిమి సూస్తా తిడ్తా ఉంది మాయమ్మ.

        కొట్టినందుకు రాగం దీస్తా ఉన్ని నన్ను ఒక్క తోపు దోసి ' పొయ్యి అబ్బోడేడుండాడో సూడుపో అని గదిమింది.

        ' నేను సూన్ను పో ' అన్న్యాను మూతి ముడుసుకోని.

        ' కమలమ్మా ఎండలకి కంది పప్పు పడడం లేదు. పెసులు గానీ పెసులు పప్పు గానీ ఉంటే పిడికిడు పెట్టమ్మా. ఈ పూటకి పులగం సేసుకుంటాను. ' అన్న్యాడు.

        ముందే అడిగుంటే ఇయ్యనానా ' అనింది. అంత వరకు కోపంగా ఉన్ని మాయమ్మ మొగం మళ్లీ మామూలుగా అయింది.

        ' ఇంతలో ఇస్కూలు నుంచి అమరావతి , సక్కూ బాయి ' ఇస్కూలుకు రావాలంటా అని ఒచ్చినారు.

        మాయమ్మ నా పక్క మింగేసెట్టు సూసింది.

        ' అమ్మా అబ్బోడు కనిపించ లేదు. వాన్ని నువ్వు కొడ్తివి. కోపంతో ఏ బాయిలో అయినా దూంకినాడో ఏమో ' అన్న్యాను ఇస్కూలు తప్పించుకోవాలని.

        ' పాపా ఈ పూట రారని సెప్పుపోండి అయివోరికి '

        ' సుబం బలకరా సుబ్బన్నా అంటే పెండ్లి కూతురు ముండ ఏడ ' అన్న్యాడంటా నీ బోటోడు. నోటికెంతొస్తే అంతా అనేదే' అని గొణగతా పెసులు పప్పు ద్యాను పొయ్యింది.

        నేను అమరావతి వాళ్లెంట బొయ్యి ' ఒచ్చే టప్పుడు నా పుస్తాకాల సంచి తెండే అన్న్యాను. వాళ్లు సరే అన్న్యారు.

గుండ్లపల్లి ఆచారి

        మా ఊరికి సుట్టపు సూపుగా అడపా దడపా వొచ్చి పొయ్యే వాళ్లలో గుండ్లపల్లి ఆచారి మామ ఒకడు.

        ఆ ఆచారి మామొచ్చినాడంటే అందురి సంగతేమో గాని నాకు మాత్రం గొబ్బియ్యాల పండగొచ్చినంత సంబరంగా ఉంటాది.

        బక్క పల్చగా చామన చాయతో మొగం నిండా అమ్మ కణాలతో , చెవులకు పోగులు బెట్టుకోని శానా తమాసగా ఉంటాడు సూడ్డానికి .

        అంతేనా! ఆచారి  మామకు ఆచారాలెక్కువ. చాదస్తా లంత కంటే జాస్తే . తన సామాన్ల మూటతో బాటు ఎక్కడికి వొచ్చినా వాటినీ మూట గట్టుకొని వొస్తాడు.

        పసుపు, నూని సాయి రంగుల పంచలు కట్టు కుంటాడు. ఏసుకొనే పొట్టి సేతుల తెల్ల సొక్కాయిలు రంగు మారి ముడతలు బడి పోయుంటాయి . 

        మాట్లాడతా ఉంటే  తమాసాగా ఆపుడప్పుడు కొన్ని అచ్చరాల్ని ముక్కు పట్టేసినట్లు గుక్కిళ్లు మింగతా మాట్లాడతాడు.

        కొన్నేండ్లకు ముందు ఒక సారి ఆచారి మామ మా ఇంటి కొచ్చినప్పుడు ఏం జరిగిందో సెప్తాను ఇనండి.
        
        ఒక  దినం అప్పుడే ఇస్కూలు నించి మద్యాన్నం అన్నం దిని పోవడానికి ఇంటికొస్తా ఉండానా ! మా ఇల్లు సేన్లో కట్టుకోవడం వల్ల ఊరిచివరగా రచ్చ బండ ఎనక పది బార్ల దూరంలో ఉంటాది. రచ్చబండకు అవతల జోడు తాటి మాన్లు. అదే మా ఇంటికి హద్దు. ఆడ మలుపు తిరిగినానో లేదో ఆచారి మామ మెల్లంగా అడుగు మింద అడుగు బెట్టు కుంటా మా ఇంటికి బోతా కనిపించినాడు.

        ఆయన్ని సూడంగానే నాకు శానా కుశాలయింది. గబ గబా ఆయన పక్కకు చేరి నడస్తా నన్ను గమనిస్తాడా లేదా అని సూస్తా ఉండా.

        ఒకసారి సూసి తలదిప్పుకున్న్యోడు మళ్లీ పక్కకు గెవనించి సూసి నన్ను గుర్తు బట్న్యాడు.

        ' ఏం పాపా అబ్బుడే బడి ఒదిలేసినారా ? ఎండ మిట మిట లాడి పోతా ఉందే! ' అని పలకరించినాడు. నవ్వినాను నేను.

        ' ఏం పాపా మాట్లాడవు బడి నించేనా? ' అడిగినాడు మళ్లీ

         ' అవును మామా'

        ' మరి పుస్తకాలేవి ?

        ' మద్యానమన్నానికి ఒదిలినారులే. మళ్లీ బోవాల' అని ఇంట్లోకి గెసబోసుకుంటా పరిగెత్తి ' అమా ఆచారి మామొస్తా ఉండాడు ' అన్న్యాను

        ' ఆచారి మామెవురు? ఎన్ని గుర్రాల మింద వస్తా ఉండాడు? అంత గెస బోసుకుంటా పరిగెత్తొచ్చి సెప్తా ఉండావు. ' అని అడిగింది మాయమ్మ సంగటికి పిండి బోస్తా .

         ' అదేమా అప్పు డప్పుడు మనింటి కొచ్చి బాడ్సి మాను కాడ అన్నమొండుకుంటాడే ఆ మామ '

        అప్పుడే '  కమలమ్మా' అంటా లోపల అడుగుపెట్నాడాయన.

         ' నువ్వా , బాగుండావా నా ? ' అని అడగతానే పెద్దింట్లోకి బోయి తలుపెనక సుట్టి పెట్టున్ని పాత సాప దెచ్చిచ్చింది.

        బుజానికున్ని జోలిని తాల్వారంలో ఒక మూల బెట్టి సాపతోనే తాల్వారాన్ని ఒక సారిట్లా ఒకసారట్లా ఇసిరి మళ్లీ దుమ్ము దుమ్ముగా ఉందను కున్యాడేమో ' కమలమ్మా పొరక్కొంచియి తల్లీ' అని అడిగినాడు.

        మాయమ్మ పొరక దెస్తే ఆ మామ అందుకో బొయినాడు. ' నువ్వుండు నా ' అని మాయమ్మే చెత్తోసి చాంతాడు బొక్కిని దెచ్చి ఆడ బెట్టి సంగటి కెలకను గుడ్సింట్లోకి దూరింది.

      కొంచిం దూరంగా కూసున్నా  నా కండ్లు మాత్రం ఆచారి మామ మిందే ఉండాయి. జోలి ఇప్పినాడు. సవకం ఇప్పి బుజమ్మింద ఏసుకున్న్యాడు. సేంతాడు బొక్కినీ తీసుకోని సేంద బాయి కాడికి బొయినాడు. నేను బొయ్యి బాయికి దెగ్గిరిగా ఇంటి ముందుండే దిన్ని మింద కూసున్న్యాను.

        మద్యానం పెద్దయివోరు పన్నెండు నించి పదారు దాకా ఎక్కాలొప్పించ మన్యాడు. పన్నెండు పదైదొచ్చు 13, 14, 16 శానా కష్టంగా  ఉండాది. ఇస్కూలుకు ఎట్లా ఎగనామం బెట్టాలా అని ఆలోచిస్తా ఉండా. ఆచారి మామను సూసినాక బిన్నిగా ఇస్కూలుకు బొయ్యి ఎక్కాలు సదుంకోవాలనుకున్ని ఆలోచన సంకెక్కింది.

        ఆచారి మామ తెచ్చిన సామాన్లు బాయికాడ బెట్టినాడు. సొక్కాయి ఇంట్లోనే తీసి పెట్టినట్లుండాడు. పంచి దీసి బాయిమిందేసి నీళ్లు సేంది నాలుగు బొక్కిన్ల నీళ్లు తల మింద కుమ్మరించుకున్న్యాడు. తువ్వాల్ని అడ్డ పంచి మాదిరిగా సుట్టుకొని సెడ్డీ పంచి మింద ఒక బొక్కిని  నీళ్లు కుమ్మరించి తప తపా ఉతికి నీళ్లలో అలిమి గెట్టింగా పిండి ఒక కొనను బాడ్సిమాను కొమ్మకు ఇంకో కొనను మందారం సెట్టు కొమ్మకు గట్టినాడు. సెడ్డీని మందారం కొమ్మ మిందేసినాడు.

        ' కొమ్మలిరిగి పోతాయి మామో 'అని పరిగెత్తినాను. నా పక్కకు గూడా సూడకుండా 'ఏమీ ఇరిగి పోవులే 'అన్న్యాడు.

        ' పాపా,  గిన్నిలో ఏసి పెట్న్యాను తిందుర్రండి. ఇస్కూలుకు టయమవుతాది. అబ్బోడేడ ' అని ఒచ్చింది మాయమ్మ. వాన్ని ఎతికే సాకుతో ఇస్కూలెగ్గొట్టి మామ సేసే పనుల్ని సూడొచ్చని నాకు అవుడియా ఒచ్చేసింది.

        ' అమా గోపి గాడు నేనెంత సెప్పినా ఇనకుండా సీనుగానెంట నేరేడు పండ్లేరక రాను అవ్వోళ్ల తోపు లోకి బొయినాడుమా ' అన్న్యానో లేదో మాయమ్మకు యాడలేని కోపమొచ్చేసింది.

        ఒక పక్క మా సేద్దిగాడు పొన్ను రంగడు బాయి కాడి కూలోళ్లకు సంగటి బెట్టియమని కాసుకోనుండాడు. ఇంగో పక్క ఆచారి మామ వంట సేసుకోను అదియ్యి ఇదియ్యి అని అడగతా ఉండాడు.

        ' ఒరే రంగా నువ్ బొయ్యి అబ్బోడేడ ఉండాడో సూసి పిల్సుకోని రాబో , ఈ లోపల నేను సంగటి గంప సర్ది పెడతా అనింది .
       
        కోపంగా ఉన్న్యప్పుడు ఇస్కూలుకు పోనంటిననుకో మాయమ్మ సింత బర్రెత్తుకొనేది కాయం. ఇస్కూలుకు బోతిననుకో పెద్దయివోరు బెత్తంతో కొడ్తే అరి సెయ్యి అప్పచ్చడుగుతాది. ఆచారి మామ అన్నం జేసుకొనేది సూడాలని శానా మునాసగా ఉండాది.

        ' కమలమ్మా తీరికేనా? ' అడిగినాడు మామ.

          ' నాకు తీరికేడుంటాది నా . నీకు తెలియదా ? సెప్పు నా ఏం కావాలో '

        అన్నం వొండే కంచు గుండాయి అట్లే సామాగ్రి కావాలమ్మా'

        ఎందుకో మా యమ్మ మొగం మింద కోపం పొయ్యి పెదాల మింద నవ్వు మొల్చింది.

        ' బాడ్సి సెట్టు కాడ సెత్తోసేసి వాదెడు కట్లె కూడా ఏసొచ్చినాను నా '

         బియ్యం పప్పు ఉప్పు సింత పండుతో సహా అన్నీ చాటలో పెట్టింది.

        'అంతంత ఇయ్యి . అన్నీ సట్టి కేసి ఒండుకోని తిని పారుకోని సస్తాడు. ' అన్న్యాను.

        ' చీ పాపిష్టి దానా , ఎవురయినా ఇంటే ఏమనుకుంటారు. సంగటి దిన మంటే నా యనకేం పని నీకు. పో! ' అని కసిరింది.

        అవిచ్చి దీగుట్లో వున్ని ముగ్గుపిండి గిన్ని దెచ్చి పేడతో అలికిన పొయిగెడ్డ మింద ముక్కర్రేసింది. .

        ఆచారి మామ పాత గుడ్డొకటి దెచ్చుకోని బియ్యం మొదులు కోని అన్నీ కొంచిం కొంచిం దీసి ఆ గుడ్డలో ఒకోటి ఒకో చోట మూట గట్టి పెట్టుకున్న్యాడు.

        ' ఆ సెత్తోనే అగ్గి కొంచిమియ్యి తల్లీ ' అని అడిగినాడు.

        మాయమ్మ మొగంలో ఏమాత్రం ఇసుగు లేదు. నన్ను పెళ్లో దాలి పొయ్యి దెగ్గిరుండే జల్లి గెంటి దెమ్మనింది.

       అగ్గిని పొయ్యి మద్దిలో ఏసి సన్న గోంకట్లిని ఇంచి దాని మింద బెట్టి ఉఫ్ ఉఫ్ అని ఉదతా ఉండాడు. మొలక్కటుకున్ని తడి సవకం అక్కడక్కడా పొడి బారతా ఉండాది.

        ఆచారి మామ గొంతుక్కూసోని ఒంగొంగి ఊదు బుర్రతో ఊదతా ఉంటే సవకం కొంచిం కొంచింగా పురుక్కు పురుక్కు మని సినగతా ఉండాది.

        ' ఆచారి మామా సవకం సినిగిపోతా ఉండాది సూడు ' అన్న్యాను.

        ' పాపా నీకింకేం పన్లేదా ? బడికి బోవా' అని కసిరినాడు.

        నేను బొయ్యి బొప్ప గిన్నిలో ఏసిన సంగటి పప్పు కూరా తెచ్చుకోని మదురు గోడ మింద కూసోని సంగటి తింటా ఉంటే మా యబ్బోడు, రంగడూ ఒచ్చినారు.

        నేరేడు పండ్లు జోబీలో ఏసుకోని సొక్కయంతా పాడుజేసుకున్న్యాడని మాయమ్మకు యాడలేని కోపమొచ్చి వాన్ని తరుముకొనింది.

        రంగడు సంగటి గంప కోసం కాసుకోనుంటే గంప వాన్నెత్తిన బెట్టి ఒచ్చింది.

        సంగటి దిని గిన్నెంతా సుబ్బరంగా ఊడ్సుకోని నాకేసి గోడమింది నించి కిందికి దూకినాను . ఆచారి మామ దెచ్చుకున్ని బిందిలో చెంబు ముంచి నొట్లో బెట్టుకున్న్యానో లేదో !

        '' అయ్యో! అయ్యో !అపచారం కమలమ్మా , నీ కూతురేం జేసిందో సూడు తల్లీ ' అని మాయమ్మను పిల్సినాడు.

        ' ఏం పాపా  ఇదేనా మీయమ్మ నీకు నేర్పించింది. నేను మడి గట్టు కోని సేంది తెచ్చుకున్ని నీళ్లలో సెయి బెడ్తావా? సెంబు సగం నోటికి బెట్టుకొని ఆ నీళ్లు తాగడ మేంది?' అని గుడ్లురిమినాడు

        మాయమ్మ యాడ కొడ్తాదో అని ఉల్సరపొయినాను నేను . ఆచారి మామ అరుపులకు బయటికొచ్చిన మాయమ్మ. సంగతి తెల్సుకోని నా ఈప్మింద రొండంటించింది.

        ' మరి నువ్ గూడా నీళ్లు కర్సుకోనే గదా తాగేది .' మా యమ్మ మింద కసిగా ఉండాది.

          ' తాగితే అది మన చెంబు, మన నీళ్లు ' అనింది.

        ' ఇది గూడా మన చెంబు మన నీళ్లేమా' అన్న్యాను .
        
        ' పూజ కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్లు. అంటారు. నా కర్మ కొద్దీ పుట్న్యారు ఉపాతకం పిలకాయిలు. మొన్న బుట్టి నిన్న కండ్లు దెర్సిన పిలకాయిలు  కూడా ఎడ్డె మంటే తెడ్డెమంటా ఉంటే ఏ గంగలో బొయి దూంకాల . సేసే దంతా తలవంపులు దెచ్చే పనులే . మళ్లీ మాటలు సూడు.' నన్ను ఉరుమురిమి సూస్తా తిడ్తా ఉంది మాయమ్మ.

        కొట్టినందుకు రాగం దీస్తా ఉన్ని నన్ను ఒక్క తోపు దోసి ' పొయ్యి అబ్బోడేడుం

Comments