మెదడుకు మేత - 8
1. నీళ్లూ మేతా లేక పోయినా నిగిడి రంకె వేస్తుంది
2. పచ్చని మేడలో తెల్లటి కుర్చీలు -
తెల్లటి కుర్చీల్లో కొలువైన నల్లటి రాణులు
౩. పసుపు పచ్చని పటేలుకు తెల్లని లుంగీలు
4. పచ్చని మానులో విచ్చుకోనుంటుంది
తెచ్చుకో బోతేను గుచ్చుకుంటుంది
ఎంత గుచ్చుకున్నా ఏమైన గాని
తెచ్చుకో మానను మెచ్చుకో మానను
5. పడగ విప్పిన బాటసారి పదిలంగా పోతాడు . ఎండకు, వానకు లొంగడు కానీ గాలికి గడ గడ లాడతాడు
6. పడతాడు లేస్తాడు
ఒంటి కన్నోడంటే ఉరిమురిమి చూస్తాడు
పండు ముసలోడంటే
పండ్లు కొరుకుతాడు
పడుచు వాడినని పంతాని కొస్తాడు పూలరంగడిలా ఎగిరి కూచుంటాడు
7. పదహారు కొమ్మల వట వృక్షం
పడితే లేవదు
8. రెక్కలు లేని చుక్కల గుర్రం
ఆకలెరుగని అందాల గుర్రం
ఎన్ని ఆమడలైన పోతుంది
9. పగడాన్ని నోట కరుచుకొని
తోకతో నీళ్లు తాగుతుంది
10. తెల్ల తెల్లని బొల్లి
చల్ల చల్లని తల్లి
కమ్మని కవితల మల్లి
మరలి రాకుంటే లొల్లి
Comments
Post a Comment