గాథా సప్తశతి - 8

గాథా సప్తశతి - 8


గాథా సప్తశతిని బట్టి చూస్తే -- ఆనాటి స్త్రీకి భర్త భయం లేదు. అత్త అదుపు లేదు. తల్లి వల్ల ఎలాంటి తగాదా లేదు. హద్దూ పద్దూ అసలే లేదు. 


        గాథా సప్తశతి  ఒక శృంగార మహా సామ్రాజ్యం . ప్రతి గాథా ప్రేమ మయం. అది ఒక శృంగార జీవితాన్ని చిత్రిస్తుంది. . ఒక శృంగార సన్నివేశాన్ని మనముందు పెడుతుంది. అయితే అదంతా మూర్తీభవించిన ఆంధ్రత్వమే . అదుపు లేని ఆ శృంగార జీవితంలో నుంచి ఆనాటి తెలుగు వాళ్ల జీవన స్వరూపాన్ని చూడ వచ్చు . 

        

        ' ఎల చివురు తోడ బ్రస్థాన కలశమందు 

          మొదటి మామిడి పూగుత్తి ముడిచినాను 

          అడలి ఏడ్వకు కూతుర! అదియె నీదు 

          ప్రియుని పరదేశ యాత్ర వారింపగలదు ' 


         ప్రియుడు పరదేశ యాత్రకు వెళ్తున్నాడని బాధ పడుతున్న కూతుర్ని తల్లి ఓదార్చడం 

ఇందులో ప్రధానంగా కనిపిస్తున్న విషయం. 

శుభ శకునం కోసం ఇంటి ముంగిట్లో పూర్ణ కలశాన్ని పెట్టడ మన్నది ఆనాటి తెలుగు వాళ్ల ఆచారం. 'అందులోని మామిడి చివుళ్లను చూసి వసంత కాలం వచ్చిందని అల్లుడు నిన్ను వదిలి పెట్టి పోలేడులే ' అని తల్లి ఓదార్పు . 


మహసముద్రం దేవకి 

Comments