మెదడుకు మేత -6

 మెదడుకు మేత -6 


1. ఉడత లాగా ఊగుతూ 

    జలగ లాగా పాకుతూ 

    పిఠాపురం వెళ్లి 

    పుడిసెడు నీళ్లు తెస్తాడు 


2. ఉదయగిరి చెరువులో ఉర్లొస్తుంది 

    పొట్టి పాడు చెరువులో పొర్లొస్తుంది 

    అందులో ఒక భామ ఆడుతూ    

    ఉంటుంది 


3. వొడి మీదవొడి గట్టు కొని కూర పీకే    చిన దానా,నీ ఒడిలో ఉండే కూర పేరేమి ? 

అర్థం తెలియని భర్తల కొడకా ఆర్నెళ్లకు రాపో చెప్తాను 

4. ఉన్న చొటే ఉంటుంది 

అవసరమైతే అడుగు ముందు  కేస్తుంది 


5. ఉండిన చోటే ఉంటుంది 

నిలబడితే నిల బడుతుంది 

నడిస్తే నడుస్తుంది 

నవ్వితే నవ్వుతుంది 

భయ పడితే భయ పడుతుంది కూర్చుంటే కూర్చుంటుంది 

పడుకుంటే పడుకుంటుంది 


6. ఎక్క లేని మాను 

దిక్కు లేని కాపు 


7. ఏతాము బావిలోతీతువు పిట్టలు ఎత్తుకో బొతే కరవనొస్తాయి 


8. ఏది రాసినా ఎంత రాసినా  మారనిది 


9. ఏలెడు బాలుడు లేచి నిల్చో గానే 

బారెడు తోక ఏలాడుతుంది 


10. చుర చుర కత్తులు 

చురారి కత్తులు రాజులు తెత్తురు రమణుల కిత్తురు 


11.  ఎర్రని కోటకు తెల్లని కాపలా దార్లు


12. నాకు రెండు  కాళున్నాయి కాని మనిషిని కాను 

తల నోరు ఉన్నాయి కానీ కళ్లు లేవు  

నోటితో కరిచి పట్టుకున్నా నంటే వదలమనే దాకా వదలను

Comments