మెదడుకు మేత - 14
1. ఆకు తమల పాకు
పూత మల్లి పూత
కాయ కజ్జి కాయ
2. ఆకాశానికి ఏగిరి అంతు లేకుండా పోతాడు
3. పళ్లుండీ కొరక లేనిది
4. పయన మైన పొగ బండి పది దిక్కులకూ పోతుంది - పలకరిస్తే పదిలంగా చుట్టు కొంటుంది
5. పనస పండు తెచ్చి పళ్లెంలో పెడితే
తినలేని వాడు దిక్కులు చూశాడు
6. పదహారు చేతులుండు
బాణాసురుడు కాడు
వీపున జెందె ముండు
విప్రుడు కాడు
తోకన తోడుండు
దొడ్డ రాజు కాడు
7. తోలు తుపాకి
మైనం గుండు
ఎక్కడ కొట్టినా
ముక్కుకు తగులు
8. దడి పచ్చన
మారాజు తెల్లన
మారాణి నల్లన
దాతు ఎర్రన
9. నడుము సన్నం నాగలింగం
పోటు పొటుకూ బొబ్బ లింగం
10. నన్ను పట్టుకొని మా అమ్మ రాగాలు తీస్తుంది . నాట్య మాడుతుంది
Comments
Post a Comment