మెదడుకు మేత - 11
1. నల్లని గొర్రె బొచ్చు - బెల్లం లాగా కరచు - ప్రాకులాడు ప్రాణి - తాకితే ముడుచు కొను
2. నాకు ఒళ్లంతా కళ్లే . వాటిని కాపాడుకోడానికి నాచూ పీచుతో కప్పు కుంటాను. అయినా గుచ్చి గుచ్చి గిల్లి గిల్లి ఆ కళ్లను పీక్కొని కఠినాత్ములు లొట్ట లేసుకు తింటారు
3. నా పేరు నాల్గక్షరాలు సగం శాలి వాహనుని ఇంట్లో ఉంటుంది . మిగతా సగం హస్తినా పురంలో ఉంటుంది. రెండూ కలిస్తే లంకా పురిలో ఉంటుంది
4. నా వెనకుండే తాటి మాను అందరిరికి కనిపిస్తుంది కాని నాకు మాత్రం కనిపించదు
5. నాలుక తెరచి నక్క పండు కుంటే ముసలమ్మొచ్చి మూడు చాటల గడ్డి
వేసిందట
6. నిటారు నిలువులు
పటాకు బయళ్లు
మజ్జిగ ముంతలు
మాణిక్యాలు
7. నీటిలో పుట్టాను
పెట్టెలో పెరిగాను
నేలపై కొచ్చాను
అంగట్లో ఉన్నాను
8. గుండ్రటి చందమామకు ఒళ్లంతా కళ్లే
9. నూతిలో అంబులు వేసేవారే కాని తీసే వాళ్లు లేరు
10. నెల్లూరుకు అవతల లేత మామిడి చెట్టు - పూత పూయకనే కాత కాయు
Comments
Post a Comment