మెదడుకు మేత -10

 మెదడుకు మేత -10


1. తెల్లటి పొలంలో - నల్లటి విత్తనాలు 

చేత్తో చల్లుతారు - నోటితో ఏరుతారు 


2. పండే పంటకు నిలుకే లేదు 

కాసే పంటకు అంతే లేదు 

వచ్చే కొద్దీ కోస్తుంటారు  

తీసే కొద్దీ వస్తుంటాను 


3. ఆకాశంలో అందాల మేడ 

ఆ మేడలో ఉంది అమృతపు కొలను

పరివారం పది వేల మందున్నా 

నివసిసించే మారాణి మాత్రం  ఒక్కతే 


4. కాళ్లు రెండే కాని మనిషి  కాడు

నోరుంది కాని మాట్లాడ లేడు 

ఎదుటి వారిని హెచ్చరిస్తాడు 

ఎక్కడి కైనా సై అంటాడు 

గాలి మేస్తాడు 

లెస్సగా నరుని మోస్తాడు


5. తాతల నాటి ఏనుగు 

తోకా తొండం లేనిది 

మేత తినదు 

నీళ్లు తాగదు 

ఎంత లేపినా లేవదు 


6. కొమ్మల్లేని చెట్టుకు రెమ్మల్లేని ఆకు 

అందరు చుట్టూ చేరి వందనాలు చేస్తారు 


7. చక్కని మానుకు చెక్కల్లేవు 


8. ఏడు కొండల కవతల 

ఎర్రప రెడ్డి కూతురు 

ఎదిగిందో లేదో అని

ఏలు పెట్టి చూస్తారు 


9. ఇల్లంత పెద్ద దాన్ని 

ఎందరొచ్చినా ఎత్త లేరు 

నల్లంత చిన్న దాన్ని 

బరువే లేని బక్క దాన్ని 

నరులంతా కలిసొచ్చినా 

నన్నెత్తుకోలేరు. నేనెవరిని ? 


10. ఎంత ఆరేసినా ఆరని సీతమ్మ చీర

Comments